వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలో లేచి నిల్చున్నారు.. దీంతో.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారిగా నవ్వులు పూశాయి..
విశాఖపట్నంలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని పరిశీలించారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్.. కనుమరుగైపోతున్న ఎర్రమట్టి దిబ్బలను వాటర్ మాన్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర సింగ్ పరిశీలించారు. జియో లాజికల్ సైంటిస్ట్ రాజశేఖర్ రెడ్డి, జల బిలాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ, కార్పొరేటర్ మూర్తి యాదవ్ తో కలిసి పరిశీలించారు.
సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఏం చేయొచ్చో.. చేసి చూపిస్తాం అన్నారు.. సోషల్ మీడియా ట్రోలింగ్స్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక విభాగం పెడతామని ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీలో రేపు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. 2 లక్షల 95 వేల కోట్ల నుంచి 3 లక్షల మధ్య బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.. రాష్ట్ర బడ్జెట్ 2024-25 కు ఆమోదం తెలుపనుంది కేబినెట్.. ఇక, మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనునుండగా.. శాసనసభ వ్యవహారాల…