ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్.. ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది.. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ ని సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు పవన్ కల్యాణ్.
మంత్రులు, ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిపాలనపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.. కేంద్రం నుంచి వచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో కేంద్ర పథకాలను అధ్యయనం చేయాలని వెల్లడించారు ముఖ్యమంత్రి.. మూసధోరణిలో కాకుండా వినూత్నంగా ఆలోచన చేయాలని సూచించారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించాలని సూచించిన ఆయన.. భూకేటాయింపులు పూర్తవగానే విశాఖ రైల్వే జోన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో కమిటీని నియమించింది.. వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది.