మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు అందించింది.. కాకాణిపై పవన్‌కు ఫిర్యాదు చేశారు ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి.. డిప్యూటీ సీఎం పవన్‌ను అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి.. లక్ష్మికి జరిగిన అన్యాయం వివరించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి..
లిక్కర్ స్కామ్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నారు.. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈడీకి రిఫర్ చేస్తామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది. మైండ్ ఉండే ఎవ్వడూ ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రూపొందించరు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. ఏం చేసినా జరిగిపోతోందనే అహకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పాత బ్రాండ్లను తప్పించారు.. కొత్త బ్రాండ్లను తెచ్చారని ఫైర్ అయ్యారు