CM Chandrababu: అచ్యుతాపురం ఘటన.. హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు
- అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై హై లెవల్ విచారణ కమిటీ..
- ఫార్మా కంపెనీ ప్రమాదంపై జిల్లా అధికారులు.. మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
- హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేశాం..
- నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవు..
- బాధ్యులైన అందరిపైనా చర్యలు వుంటాయి..
- అధికారులు ఆలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసిన ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేశాం.. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవు.. బాధ్యులైన అందరిపైనా చర్యలు వుంటాయి.. అధికారులు ఆలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.. ఇక, నష్ట పరిహారం మొత్తం కంపెనీ భరిస్తుందన్న ఆయన.. యాజమాన్యం ఇప్పటి వరకు అందుబాటులో లేకుండా పోయింది.. పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.. కానీ, అంత కంటే ముందు భద్రత చాలా అవసరం అన్నారు.. ఐదేళ్లలో 119 ప్రమాదాలు జరిగితే 120 మంది చనిపోయారు.. ఎంఫోర్మెంట్ ఏజెన్సీలు అన్నీ మూకుమ్మడిగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. నివేదికలు అన్ లైన్ లో అప్ లోడ్ చేయాలి… వాటిని మళ్ళీ ర్యాండం గా ఆడిట్ చేస్తాం.. ప్రమాదాలు పునరావృతం కాకుండా పూర్తి బాధ్యత పరిశ్రమల యాజమాన్యాలదే అన్నారు.
Read Also: Mobile Salon: అదిరిందయ్యా ఐడియా.. ఒక్క ఫోన్ తో ఇంటి వద్దకే సెలూన్!.. వీడియో వైరల్
Also Read
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
రెడ్ జోన్ పరిశ్రమల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. ప్రమాదాలను వీలైనంత వరకు తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలన్నారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేసి తుడుచుకో మనే పరిస్థితి ఇటీవల రాష్ట్రంలో ఉందన్నారు.. వారసత్వంగా వచ్చిన లేగసి సమస్యనా.. లేక పరిశ్రమలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అనే అనుమానం ఉంది.. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తాం అన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు సేఫ్టీ విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాలి.. గత ఐదేళ్లు పరిశ్రమలను లూట్ చేశారు.. ఆ కారణం గానే ప్రమాదాలు ఎక్కువయ్యాయి.. వారసత్వంగా వచ్చిన లేగసీ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు కనిపిస్తోందన్నారు.
మాకు 93శాతం స్ట్రయిక్ రేట్ ఇవ్వడం వెనుక ప్రజలు, యువకులకు చాల ఆశలు వున్నాయి అన్నారు సీఎం చంద్రబాబు.. ఆ దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.. అచ్యుతాపురంలో వాయు కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం అన్నారు.. అచ్యుతాపురం ప్రమాదంలో 17 మంది చనిపోయారు. హృదయ విదారకంగా సంఘటనలు జరిగాయి.. అన్నారు.. చనిపోయిన వాళ్లకు ఆర్థిక సహాయం కింద చెక్కులు ఇవాళే పంపిణీ చేయమని అదేశించామన్నారు.. ఇక, వేపర్ క్లౌడ్ ఎక్స్ ప్లోజన్ కారణంగా ప్రమాదం జరిగింది… SOP ఫాలో అవ్వలేదని స్పష్టంగా అర్ధం అవుతుందన్నారు. ఇప్పటి వరకు 119 ప్రమాదాలు జరిగే 120మంది చనిపోయారు.. LG పాలిమర్స్ ప్రమాదకర వాయువు.. ఇప్పుడు జరిగింది అధికంగా పేలుడు స్వభావం కలిగింది.. అందుకే భారీ నష్టం జరిగింది… LG పాలి మర్స్ ప్రమాదంపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసిన కఠిన చర్యలు అమలు చేయలేదని విమర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!