Brookfield to Invest in AP: ఏపీలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. ముందుకొచ్చిన బ్రూక్‌ఫీల్డ్
- ఆంధ్రప్రదేశ్ లో 5 బిలియన్ల యూఎస్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు..
- ముందుకు వచ్చిన గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్..
- సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధుల భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brookfield to Invest in AP: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది.. ఇప్పటికే పలు సంస్థలతో సీఎం చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరుపుతున్నారు.. అయితే, పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానాలలో ఒకటిగా పరిగణించబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 5 బిలియన్ల యూఎస్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ ప్రమోట్ చేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ ఎవ్రెన్ ముందుకొచ్చింది. బ్రూక్‌ఫీల్డ్ , యాక్సిస్ యాజమాన్య బృందం.. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో దశలవారీగా 3500 మెగావాట్ల సోలార్ , 5500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎవ్రెన్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వీటిలో 3000 మెగావాట్ల ప్రాజెక్టులకు ఇప్పటికే రాష్ట్రంలో శంకుస్థాపన జరిగిందని, 2026 చివరి నాటికి ఆ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని తెలిపారు. పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల ప్రణాళికలే కాకుండా, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్, ఈ-మొబిలిటీ, గ్రీన్ అమ్మోనియా వంటి వాటిలో రాష్ట్రంలో అదనపు అవకాశాలను ఎవ్రెన్ అన్వేషిస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇక, ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనువైన విధానాలను అమలుచేస్తోందని , పెట్టుబడిదారులకు, ప్రజలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సమయానుకూల అనుమతులతో పాటు పారదర్శకతను ప్రోత్సహించేందుకు , రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని అన్నారు. ఇంధన రంగంలో పెట్టుబడులను సాకారం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన అవకాశాలకు, ఉద్యోగ కల్పనకు, స్థిరమైన అభివృద్ధి సాదించేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయన్నారు. సౌర, పవన ఇంధన వనరులతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ఏపీలో ఆకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. సోలార్ పార్కులు, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్‌లు, పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
- Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
మరోవైపు.. సుమారు 1 ట్రిలియన్ యు ఎస్ డాలర్ల తో ప్రపంచవ్యాప్తంగా 2,40,000 మంది ఉద్యోగులతో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ లో బ్రూక్‌ఫీల్డ్ గ్లోబల్ లీడర్‌గా ఉందని బ్రూక్ ఫీల్డ్ అధికారులు పేర్కొన్నారు.. బ్రూక్‌ఫీల్డ్ రెన్యూవబుల్స్ పునరుత్పాదక ఇంధనాన్ని , ప్రపంచ ఇంధన పరివర్తన , వాతావరణ పరివర్తన కు సంబందించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి 100 బిలియన్ యూఎస్ డాలర్లతో ఐదు ఖండాలలో విస్తరించి ఉన్న హైడ్రో, పవన, సౌర, స్టోరేజి , విద్యుత్ పంపిణి వంటి వాటిలో 7,000 కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పాదక సౌకర్యాలలో 33,000 మెగావాట్లకు మించి ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉందన్నారు. బ్రూక్‌ఫీల్డ్ రెన్యూవబుల్స్ 5 ఖండాలలో విస్తరించి ఉన్న బహుళ పునరుత్పాదక సాంకేతికతలలో 155,000 మెగావాట్ల గ్లోబల్ డెవలప్మెంట్ పైప్‌లైన్‌ను కలిగి ఉందని వెల్లడించారు.. ఇక, బ్రూక్‌ఫీల్డ్ సంస్థ, దశాబ్దానికి పైగా నైపుణ్యం కలిగిన క్లీన్‌టెక్ కంపెనీ అయిన యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుందని , 2019లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలు చేసి , 1.8 GW సౌర, పవన ప్రాజెక్టులను విజయవంతంగా అభివృద్ధి చేసిందని తెలిపారు . దేశంలో క్లీన్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్‌లను ముందుకు తీసుకు వెళ్లేందుకు బ్రూక్‌ఫీల్డ్ మరియు యాక్సిస్ ఎనర్జీ మధ్య 51:49% హోల్డింగ్ తో ఎవ్రెన్ సంస్థ ను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.
ఉద్యోగాల కల్పన, పన్ను సహకారం ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఈ పెట్టుబడులు ఎంతగానో తోడ్పడతాయని, ఈ పెట్టుబడి ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్ లో ఇంధన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం , ప్రపంచ ఇంధన పరివర్తనకు సహాయపడడంలో ఎవ్రెన్ నిబద్ధతను తెలియచేస్తుందని, అలాగే క్లీన్ ఎనర్జీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను వారి ప్రధాన గమ్యస్థానంగా మారుస్తుందని బ్రూక్‌ఫీల్డ్ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ లతో జరిగిన సమావేశంలో బ్రూక్ ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్లు నావల్ సైనీ, ముర్జాష్ మనీక్షణ, ఎవ్రన్ సంస్థ ఎండీ రవి కుమార్ రెడ్డి, సీఈవో సుమన్ కుమార్, యాక్సిస్ సీఈవో మురళి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీవీవీ సత్య ప్రసాద్ లు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!