నేను ముఖ్యమంత్రి భార్యగా ఇక్కడికి రాలేదు.. మీలో ఒక మహిళగా ఇక్కడికి వచ్చాను అని వ్యాఖ్యానించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 3వ రోజు రామకుప్పం గ్రామంలో పర్యటించిన భువనేశ్వరి.. గ్రామ మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ కేబినెట్ లో కీలక చర్చ జరిగింది.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలన్న టెక్నికల్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది కేబినెట్ భేటీ.. దీంతో.. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ను కొత్తగా నిర్మించనుంది ప్రభుత్వం. ఇక, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ లో ప్రతిపాదించనుంది ఏపీ ప్రభుత్వం..
ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 95 శాతం మంది ఎమ్మెల్యేలపై గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారు అని దుయ్యబట్టారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.. వైసీపీ నాయకులు చేసిన తప్పు ఎన్డీయే ప్రభుత్వం చేయదన్న ఆయన.. అధికారం ఉంది కదా అని పేట్రేగిపోయిన వైసీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు ఉంటాయి అని సీఎం చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు