Floods Damage in AP: అంతకంతకు పెరుగుతోన్న వరద నష్టం.. ప్రాథమిక అంచనాలు దాటేస్తోంది..
- ఏపీలో అంతకంతకు పెరుగుతోన్న వరద నష్టం..
- ప్రాథమిక అంచనా ప్రకారమే రూ 6882 కోట్ల మేర నష్టం..
- కేంద్రానికి నివేదిక పంపిన రాష్ట్ర ప్రభుత్వం..
- క్రమంగా పెరిగిపోతున్న నష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Floods Damage in AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి.. ముఖ్యంగా విజయవాడను అతలాకుతలం చేశాయి.. అయితే, ఏపీలో అంతకంతకు పెరుగుతోంది వరద నష్టం. ప్రాథమిక అంచనా ప్రకారమే రూ. 6882 కోట్ల మేర నష్టం వాటిలినట్టు కేంద్రానికి ఏపీ సర్కార్ ఇప్పటికే నివేదిక పంపింది.. మరోవైపు.. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తి స్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ కొనసాగుతోంది.. ఇప్పటికే 46 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు.. ఇక, అంతకంతకు వ్యవసాయ, ఆస్తి నష్టం అంచనాలు పెరిగిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఇంటికీ జరిగిన డ్యామేజ్ లెక్కేస్తే భారీగా వరద నష్టం ఉంటుందని అధికారులకు అంచనాలు ఉన్నాయట..
Read Also: Budameru Floods: కొల్లేరుకు భారీగా బుడమేరు వరద.. 9 గ్రామాలకు రాకపోకలు బంద్..
Also Read
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
రాష్ట్రంలో జరిగిన వరద నష్టం విషయానికి వస్తే.. 4.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలకు, 49 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు, 200 ఎకరాల్లో సెరీకల్చర్ కు నష్టం జరిగిందట.. ఏపీలో మొత్తంగా 5921 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి.. 4203 కిలో మీటర్ల మేర స్టేట్ హైవేస్ దెబ్బతింటే.. పంచాయతీల పరిధిలో 1160 కిలో మీటర్లు, పట్టణాల పరిధిలో 558 కిలో మీటర్ల మేర రోడ్డులు డ్యామేజ్ అయ్యాయట.. ఇక, 540 పశువులు మృత్యువాత పడగా.. కిలో మీటర్ల మేర 11 కేవీ లైన్లు, ఎల్టీ లైన్లు దెబ్బతిన్నాయి.. 76 సబ్ స్టేషన్లు ముంపు బారిన పడిపోయాయి.. వరదలకు 1283 ఎల్టీ ఎలక్ట్రిక్ పోల్స్, 1668 11 కేవీ ఎలక్ట్రిక్ పోల్స్ దెబ్బతిన్నాయి.. బుడమేరు సహా వివిధ ప్రాంతాల్లో భారీ గండ్లు పడి అపార నష్టాన్ని మిగిల్చాయి.. మొత్తంగా 405 చోట్ల కాల్వలకు.. చెరువులకు గండ్లు పడినట్టు అధికారులు చెబుతున్నారు.. ఇలా అంతా లెక్కిస్తూ పోతుంటే.. వరద నష్టం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!