శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం మార్పుపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు బాలయ్య.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఈ నెల 10వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. ప్రియుడి హత్య వెనుక ప్రియురాలు ఉన్నట్టుగా గుర్తించారు.. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు.
పేదలకు అన్న క్యాంటీన్ కడుపు నింపుతుంది.. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం అవ్వడం ఒక పండగ లాంటిది అన్నారు నటసింహా, హిందపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. శ్రీ సత్యసాయి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్యే బాలకృష్ణ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి ఢిల్లీ బాటపట్టనున్నారు.. ఈ రోజు.. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన చేరుకోనున్నారు చంద్రబాబు.. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.
పోలవరం ప్రాజెక్టు సవాళ్లపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం కీలక సూచనలు చేసింది. వర్షాకాలం దాటగానే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు వీలుగా డిజైన్, నిర్మాణ అంశాలు చర్చించేందుకు వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందులో పోలవరం ప్రాజెక్ట్ డిజైనర్, ప్రాజెక్టను పర్యవేక్షించే ఇంజినీర్ల బృందం, విదేశీ నిపుణుల బృందం ఉండాలని సూచించింది.
రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించి.. పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి.