ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు వర్షాలు, వరదల కారణంగా 19 మంది మృతిచెందారు.. ఇద్దరు గల్లంతు అయినట్టు పేర్కొంది.. ఇక, 136 పశువులు, 59,700 కోళ్లు మరణించాయని.. 134 పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 6 వేల పశువులకు వ్యాక్సిన్ అందించడం జరిగిందని వెల్లడించింది.
విజయవాడ-హైదరాబాద్ రూట్లో రాకపోకలకు లైన్ క్లియర్ అయ్యింది.. ఐతవరం దగ్గర హైవే పై చేరిన వరద నీరు తగ్గటంతో వాహనాలను అనుమతి ఇస్తున్నారు అధికారులు.. అయితే.. హైవేపై బురద పేరుకు పోవటంతో వాహనాలను నెమ్మదిగా ఆ ప్రాంతాన్ని దాటిస్తున్నారు..
గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.. వర్షాలు, వరదల దెబ్బకి విమాన ప్రయాణాలకు డిమాండ్ వచ్చింది.. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, రైలు మార్గాలలో అంతరాయం ఏర్పడడంతో... గన్నవరం విమానాశ్రయంలో రద్దీ పెరిగిపోయింది.. అయితే, పెరిగిన రద్దీతో టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.
కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు, వరదలు చూస్తున్న బెజవాడ వాసులు ఇప్పుడు తమ వస్తువులను కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు.. లక్షలు పోసి కొనుగోలు చేసిన కార్లను కాపాడుకోవడం వారికి పెద్ద సమస్యగా మారిపోయింది.. ఇప్పటికే వందలాది కార్లు.. ఇతర వాహనాలు నీటమునిగి పోగా.. మిగతా వారు తమ కార్లను, వాహనానుల కాపాడుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు.. అయితే, ఇప్పుడు బెజవాడ వాసులకు దుర్గగుడి ఫ్లైఓవర్ పార్కింగ్ స్పాట్గా మారిపోయింది..
అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు.. వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.. వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కరకట్ట దగ్గర అవుట్ స్లూయుజ్ గండిని పూడ్చడానికి జరుగుతున్న పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ.. ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేసిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. 11.80 లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణా నదికి వస్తుంది. ఇది కృష్ణానది చరిత్రలోనే అతి ఎక్కువ ఫ్లడ్ అన్నారు..
కృష్ణానది వరద 12 లక్షల క్యూసెక్కులు చేరుతుందనే అంచనా నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది.. ప్రకాశం బ్యారేజ్ దిగువున ఉన్న విజయవాడ సిటీ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డలకు ముప్పు వంచిఉన్న నేపథ్యంలో.. పెరుగుతున్న వరద దెబ్బకి వణికిపోతున్నారు జిల్లా వాసులు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం.. వారిని క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది.. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తూ వస్తుంది.. కొన్ని రైళ్లను రద్దు చేస్తే.. మరికొన్ని సర్వీసులను దారి మళ్లిస్తుంది.. ఇంకా కొన్ని రైళ్లను తాతాల్కికంగా రద్దు చేసింది.. అయితే, తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో450 రైళ్లు రద్దు చేయగా.. తాజాగా మరో 31 ట్రైన్లు రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.. ఇక, మరో 13 రైళ్లను…
వరద బాధితులకు ఆహార పంపిణీ కోసం రంగంలోకి దిగాయి హెలికాఫ్టర్లు. ప్రస్తుతం రెండు హెలికాఫ్టర్ల ద్వారా బుడమేరు ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం అందిస్తున్నాయి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు.. ఇప్పటి వరకు 3 టన్నులకు పైగా ఆహారం, నీళ్లు బాధితులకు అందజేశారు.. బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, బ్రెడ్, ఫ్రూట్ జ్యూస్, టెట్రాప్యాక్స్, ఇతర ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు.