కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.. రైతులను వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు..
రెండు గంటల పాటు క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. సహాయక చర్యల్లో అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. అధికారులకు లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు.. తానే స్వయంగా రంగంలోకి దిగినా అధికారుల మొద్దు నిద్ర వీడకుంటే ఎలా అంటూ అధికారులకు క్లాస్ తీసుకున్నారు ఏపీ సీఎం.
లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది చంద్రబాబు సర్కార్.. డ్రోన్ల ద్వారా ఫుడ్, బాస్కెట్స్ తీసుకెళ్లే విధానాన్ని పరిశీలించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
గతంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. తప్పు చేయాలంటేనే ఎవరైనా భయపడేవారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీలో మహిళల రక్షణ చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంతో విజయవాడ నగరం అతలాకుతలం అవుతుంది.. కుంభవృష్టి ధాటికి స్తంభించిపోయింది బెజవాడ.. అస్తవ్యస్తంగా మారిపోయాయి నగరంలో ఉన్న రోడ్లు..
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి.. మరో మూడు రోజుల కూడా భారీ వర్షలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలు ప్రభుత్వం అప్రమత్తం అయ్యాంది.. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా వర్షాలపై పరిస్థితిని సమీక్షించారు సీఎం చంద్రబాబు.. ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని వర్షాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.. అందరినీ అప్రమత్తం చేస్తున్నారు.
విజయవాడలోనూ ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది.. దీంతో.. విజయవాడ సున్నపు బట్టీల సెంటర్లో కొండచరియలు విరిగిపడ్డాయి... ఈ ఘటనలో ఓ ఇల్లు కూలిపోయింది.. నలుగురురికి తీవ్రగాయాలు అయినట్టు చెబుతున్నారు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని రెండు చోట్ల ఇళ్లు కూలాయి.. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. రెండు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు సిబ్బంది.. శిథిలాల్లో తొమ్మిది మంది చిక్కుకోగా.. వారిని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు..
భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చు అన్నారు సీఎం.. పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని.. టార్గెట్లు పెట్టవద్దని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. అయితే, వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.