వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు నాయుడు.. అమరావతి మునిగిందా..? వీళ్లను పూడ్చాలి.. అప్పుడే బుద్ది వస్తుంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.. ఒక్క వ్యక్తి అహంభావం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడాలా..? ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా..? ఇలాంటి రాజకీయ నేరస్తులను.. తప్పుడు ప్రచారం చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలని కామెంట్ చేశారు..
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై విచారణకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.. బాలికల హాస్టల్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థుల ఫిర్యాదుపై దుమారం రేగిన విషయం విదితమే కాగా.. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లోతైన విచారణ చేపట్టారు పోలీసులు..
బుడమేరు నీరు కొల్లేరు, కృష్ణానదికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ప్రవాహ దారిలో కాలువలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తాం. ఇలాంటి విపత్తులను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలి. వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అన్నారు.. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదే అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్..
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్ర స్థాయి పర్యటనతో సీఎం భద్రతా సిబ్బంది, అధికారులు పరుగులు పెట్టారు.. వరదలో.. అందునా జేసీబీపై నాలుగున్నర గంటల పాటు 22 కిలో మీటర్లు పర్యటించిన సీఎం చంద్రబాబు. కాన్వాయ్ని వీడి 22 కిలోమీటర్ల మేర పర్యటించడం ఇదే తొలిసారంటున్నాయి అధికారిక వర్గాలు.
సహాయక చర్యలకు ఆటంకమనే నేను ఫీల్డ్లోకి రాలేదని స్పష్టం చేశారు.. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని నేను అనుకున్నాను.. కానీ, అధికారులు నన్ను సందర్శించవద్దని సూచించారు.. ఇది రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్లకు అసౌకర్యాన్ని కలిగిస్తుందన్నారు.. ఇంత విపత్తు సమయంలో నేను సాయపడాలి.. కానీ, అదనపు బరువు కాకూడదు.. అందుకే నేను క్షేత్రస్థాయిలో పర్యటించలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తదుపరి 10 రోజుల్లో ప్రసవించే 154 మంది గర్భిణిలను వైద్య ఆరోగ్య శాఖ సురక్షిత ప్రాంతాలకు చేర్చిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు.. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవల్ని అందించేందుకు అనేక కార్యక్రమాల్ని చేపట్టిందన్నారు. పునరావాస కేంద్రాలకు అనుబంధంగా 14 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడంతో పాటు వీటికి అదనంగా 20 సంచార వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసి వైద్య సేవల్ని అందించిందన్నారు.
ఈ రోజు మధ్యాహ్నం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగింది.. కాన్వాయ్, ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో సీఎం పర్యటించారు.. దాదాపు ఆరు గంటల పాటు కాన్వాయ్ వదిలి జేసీబీ పైనే వరద ప్రాంతాల్లో తిరిగారు.. వరద ప్రాంతాల్లో సీఎం జేసీబీపై వెళ్లడంతో వివిధ ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్ తిరిగాల్సి వచ్చింది..