ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఈ రోజు కర్నూలు జిల్లా ఓర్వకల్ లో చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. వాతావరణంలో మార్పులు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆ టూర్ను క్యాన్సిల్ చేశారు..
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వివిధ శాఖల్లో ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ముఖ్య శాఖల్లో కీలక పదవుల్లో ఉన్న వారిని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి నీరబ్ కుమార్ ప్రసాద్..
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది.. మంత్రి, అధికారుల హామీలతో కాస్త వెనక్కి తగ్గిన విద్యార్థినులు.. ఆరోపణలు ఎదుర్కుంటున్న విద్యార్థిని తరలించే ప్రయత్నం చేయడంతో.. మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి..
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాలతో ఆయా చోట్ల పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన సీఎం.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు..
భారీ వర్షాల నేపథ్యంలో.. ఇప్పటికే పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు.. ఈ రోజు ఇప్పటికే గుంటూరు, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లా పర్యటించనున్నారు. అయితే, సీఎం చంద్రబాబు.. కర్నూలు జిల్లా పర్యటనలో మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఆయన పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో పర్యటించాల్సి ఉండగా.. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆ పర్యటన రద్దు అయ్యింది. దానికి బదులుగా ఓర్వకల్లో పర్యటిస్తారు సీఎం చంద్రబాబు... అక్కడ ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించింది.. ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లాకో స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. రాష్ట్రంలోని 26 జిల్లాలకు 26 మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..