Deputy CM Pawan Kalyan: నేడు జనసేనలోకి కీలక నేతలు.. కండువా కప్పి ఆహ్వానించనున్న పవన్..
- జనసేనలోకి వైసీపీ కీలక నేతలు..
- పార్టీలో చేరనున్న బాలినేని.. సామినేని.. కిలారి రోశయ్య..
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు.. ఇలా వరుసగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.. ఇప్పటికే పలువురు నేతలు.. టీడీపీ గూటికి చేరగా.. మరికొందరు జనసేన.. ఇంకా కొందరు బీజేపీ కండువాలు కప్పుకున్నారు.. అయితే, ఈ రోజు జనసేన పార్టీలో కీలక నేతలు చేరబోతున్నారు.. సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదబభాను, కిలారి రోశయ్య కూడా ఈ రోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు..
Read Also: IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ముంబై ఇండియన్స్‌కు భారీ ప్రయోజనం!
Also Read
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
నేడు జనసేనలో చేరనున్నారు వైసీపీ కీలక నేతలు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య.. దీని కోసం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. మధ్యాహ్నం 12 గంటలకు ఒంగోలు నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బయల్దేరనున్నారు.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.. ఇవాళ అతికొద్ది మంది మాత్రమే బాలినేనితో పాటు పార్టీలో చేరనుండగా.. త్వరలో ఒంగోలు వేదికగా భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇక, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను.. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేయగా.. మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీగా బయల్దేరి జనసేన కార్యాలయానికి చేరుకోనున్నాఉ ఉదయభాను.. మరోవైపు.. ఇటీవలే వైసీపీకి గుడ్‌బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య.. ఇప్పటికే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశమై చర్చించారు.. ఆయనతోపాటు వియ్యంకుడు రవిశంకర్ కూడా జనసేన గూటికి చేరనున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన రోశయ్య.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. ఈ రోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు కిలారి రోశయ్య..
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!