నెల్లూరు జిల్లాలో ఆస్తి కోసం కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సైదాపురం మండలం మొలకల పూండ్లలో తండ్రిని కుమారుడు దారుణంగా హత మార్చిన ఘటన జరిగింది.. స్థానికంగా నివసించే పాలెపు వెంకటేశ్వర్లు... ఆయన కుమారుడైన శివాజీకి గత కొద్ది కాలంగా ఆస్తులకు సంబంధించి వివాదం జరుగుతోంది.
ఏపీ మంత్రి సంధ్యారాణికి తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది.. విజయనగరం జిల్లా రామభద్రపురం సమీపంలోని భూసాయవలస వద్ద మంత్రి సంధ్యారాణి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం సంభవించింది.. జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో.. ఎస్కార్టు వాహనం టైరు పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన వాహనం.. ఓ వ్యాన్‌ను ఢీ కొట్టింది.
అన్నదమ్ములు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది.. జిల్లాలోని ఉంగుటూరు మండలం నారాయణపురం చెందిన అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు.. ఏప్రిల్ నెలలో ఇంటి వెళ్లిపోయారు అన్నదమ్ములు లక్ష్మీనారాయణ (34), వినోద్ (32).. తాజాగా వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు..
ఈ ఏడాది కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరదలు వస్తున్నాయి.. శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను ఈ ఏడాదిలో ఈ రోజు నాల్గోసారి ఎత్తారు నీటిపారుదలశాఖ అధికారులు.. ఇన్‌ఫ్లో తగ్గడంతో బుధవారం రోజే శ్రీశైలం గేట్లను మూసివేశారు అధికారులు.. అయితే, మరోసారి క్రమంగా వరద ఉధృతి పెరడంతో.. ఈ రోజు శ్రీశైలం డ్యామ్‌లోని ఒక గేటును ఎత్తారు.. ఒక్క గేటును 10 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌కు నీటిని విడిచిపెడుతున్నారు..
గంజాయి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. కొర్లగుంట మారుతీనగర్ కొత్తపల్లి క్రాస్ వద్ద ఉదయం నిఘా ఉంచి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ఆదిమూలం డిశ్చార్జ్ అయ్యారు.. ఆ తర్వాత పుత్తూరులోని తన నివాసానికి చేరుకున్నారు.
గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా నదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేశారు.. దీంతో వరుసగా రెండో రోజూ కూడా గణేష్ నిమజ్జనాలు గోదావరిలో చేయడాన్ని నిలుపు వేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా నిమజ్జనానికి ఊరేగింపులతో గణేష్ విగ్రహాలు తీసుకుని వస్తున్న వాటిని పోలీసులు వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.
వయనాడ్‌లో ఇటీవల వరదలతో పాటు కొండచరియలు విరిగి పడిన ఘటనలో తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన యువతి జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆమెపై విధి మరోసారి కన్నెర్ర చేసింది. సర్వస్వం కోల్పోయి.. ఇప్పుడిప్పుడే గుండె నిబ్బరం చేసుకొని ముందుకు సాగుతున్న ఆమె జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. జీవితాంతం తోడునీడగా ఉంటానంటూ మాటిచ్చిన వ్యక్తిని విధి.. రోడ్డు ప్రమాదం రూపంలో బలితీసుకుంది. దీంతో అటు కుటుంబ సభ్యులను,…