Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer 2 Release: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 (Jailer 2) విడుదల తేదీ ఖరారైంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత సంస్థ “సన్ పిక్చర్స్” అధికారికంగా ప్రకటించింది.
చిత్ర విడుదల తేదీని వెల్లడిస్తూ మేకర్స్ ప్రత్యేక అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో నటుడు ‘వినాయకన్’ తనదైన శైలిలో జారీ చేస్తూ కనిపించగా.. ఆ తర్వాత రజనీకాంత్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. 2023లో విడుదలైన జైలర్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ సమపాళ్లలో ఉండటంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.650 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తొలి భాగం సాధించిన విజయంతో ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ ముగిసిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రజనీకాంత్.. సినిమా ఫైనల్ దశలో ఉందని, విడుదల తేదీని నిర్మాతలు త్వరలో ప్రకటిస్తారని వెల్లడించారు. ఇప్పుడు అధికారికంగా అక్టోబర్ 15 తేదీని ఖరారు చేశారు. ఈ సీక్వెల్లో రజనీకాంత్‌తో పాటు ప్రముఖ నటి రమ్య కృష్ణన్ మరోసారి విజయ పాండియన్ (VG) పాత్రలో కనిపించనున్నారు. అలాగే నటి మీరేనా కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కూడా చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నట్లు సినీ వర్గాల టాక్.
జైలర్ మొదటి భాగం విజయంలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం కీలక పాత్ర పోషించింది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ‘జైలర్ 2’కు కూడా అనిరుధ్ సంగీతం అందిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. అక్టోబర్ 15న దసరా సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని విడుదలవుతున్న ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద ఈసారి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలిమరి.
One name to rule the game! 💥#Jailer2 storms into theatres worldwide on October 15 🔥 #Jailer2FromOct15 #RajiniTheJailer2FromOct15@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren… pic.twitter.com/RJIpMXVekv
— Sun Pictures (@sunpictures) July 2, 2026
తాజావార్తలు
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!