144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo Pad 5c Launched: వివో (Vivo) నుండి కొత్త ట్యాబ్లెట్ Vivo Pad 5cను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. స్నాప్ద్రగోన్ ప్రాసెసర్, హై-రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, భారీ బ్యాటరీ, AI ఆధారిత ఫీచర్లతో ఈ ట్యాబ్లెట్ వినియోగదారులను ఉపయోగపడేలా రూపొందించారు.
2.8K రిజల్యూషన్‌తో 144Hz డిస్ప్లే:
Vivo Pad 5cలో 12.1 అంగుళాల పెద్ద డిస్ప్లేను అందించారు. ఇది 2.8K రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే గరిష్టంగా 900 నిట్స్ బ్రైట్నెస్ను అందించగలదని కంపెనీ వెల్లడించింది. దీంతో వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, చదువు, ఆఫీస్ పనులు వంటి కార్యకలాపాల్లో మెరుగైన అనుభవాన్ని పొందవచ్చు.
Also Read
- Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
Snapdragon 8s Gen 3 ప్రాసెసర్:
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ ట్యాబ్లెట్లో Qualcomm Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 12GB LPDDR5X ర్యామ్, 256GB UFS 4.1 స్టోరేజ్‌తో జత చేయబడింది. ఈ కాంబినేషన్ వల్ల మల్టీటాస్కింగ్, హెవీ యాప్స్, గేమింగ్ వంటి పనులు సాఫీగా సాగుతాయి.
AI ఫీచర్స్:
Vivo Pad 5cలో పలు AI ఆధారిత ఫీచర్లను అందించారు. ఇందులో AI PPT అసిస్టెంట్, వివో ఫైల్ ట్రాన్స్ఫర్, ఫ్లోటింగ్ విండో సపోర్ట్ వంటి స్మార్ట్ టూల్స్ ఉన్నాయి. అలాగే WPS ఆఫీస్ సపోర్ట్ ఉండటంతో విద్యార్థులు, ఉద్యోగులకు ఇది మరింత ఉపయోగకరంగా మారుతుంది.
కెమెరా, ఆడియో:
ఫోటోగ్రఫీ కోసం ట్యాబ్లెట్ వెనుక భాగంలో 8MP కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఉంది. అలాగే, నాలుగు స్పీకర్లతో కూడిన పానోరమిక్ సౌండ్ సిస్టమ్‌ను అందించడంతో ఆడియో అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది.
10,000mAh బ్యాటరీ:
ఈ ట్యాబ్లెట్లో 10,000mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని వల్ల ఎక్కువ సమయం పాటు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే డివైస్‌లో 3D కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడంతో అధిక వినియోగ సమయంలో కూడా వేడి నియంత్రణ మెరుగ్గా ఉంటుంది.
ధరలు, రంగులు:
Vivo Pad 5c మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,699 (రూ.37,000)గా నిర్ణయించారు. అలాగే 8GB + 256GB వేరియంట్ ధర CNY 2,999 (రూ.41,000), 12GB + 256GB వేరియంట్ ధర CNY 3,499 (రూ.47,000)గా ఉంది. ఈ ట్యాబ్లెట్ బ్లూప్రింట్, గ్రీన్, గ్రే రంగుల్లో లభిస్తోంది. ప్రస్తుతం చైనాలో వివో అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..