గుండ్లవల్లేరు ఘటనలో నూటికి నూరు శాతం హిడెన్ కెమెరాలు అంశం దాగి ఉందని మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.. కడప నగరంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడిన ఆమె.. రెండు షవర్లను చీకట్లో పోలీసులు ఎత్తుకెళ్లడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించడం.. తెల్లారేసరికి పరిస్థితులు మారుతాయి అనడం.. అనుమానాలకు తావిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
నగరి నియోజక వర్గంలో కీలక నేతగా ఉన్నర కేజే కుమార్, కేజే శాంతిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది వైసీపీ.. ఈ మేరకు లేఖను విడుదల చేశారు చిత్తురు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ స్థానిక నాయకుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 11 నియోజకవర్గాలకు కలిపి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. కలసి కట్టుగా పార్టీనీ బలోపేతం చేయాలని, సమస్యలు వస్తే అందరూ కలసి వెళ్లాలని గురువారం జరిగిన చిత్తూరు జిల్లా వైసీపీ నేతలను సూచించారు పార్టీ అధినేత వైఎస్ జగన్.
పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. ఇంట్లో వాళ్లకి.. స్నేహితులకు కష్టాలు అంటే ఇదేనేమో.. కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్లిపోతే.. తల్లిని పట్టుకుని స్తంభానికి కట్టి చిత్ర హింసలకు గురిచేశారు.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది..
రాజమండ్రి శివారు ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత పులిని పట్టుకోడానికి ఆపరేషన్ కొనసాగుతుంది. దివాస్ చెరువు అటవీప్రాంతాలలో అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుతపులి కదలిక చిత్రాలు గుర్తించారు. చిరుతపులి ప్రస్తుతం దివాస్ చెరువు అటవీప్రాంతంలోనే ఉందని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. చిరుతపులి పాదముద్రాలు కనుగొన్నారు. చిరుతపులి కదలికలను గుర్తించే నిమిత్తం సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను కొన్ని ప్రదేశాలలో అమర్చారు..
వరద నష్టంపై తొలిసారి భేటీకానుంది కేబినెట్ సబ్ కమిటీ... ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీకానున్నారు మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, అనగాని ప్రసాద్, వంగలపూడి అనిత. ఇప్పటి వరకు జరిగిన వరద నష్టం అంచనాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం, ఇళ్ల నష్టం అంచనాలపై చర్చించనుంది కేబినెట్ సబ్ కమిటీ..
ఉద్యోగుల బదిలీల గడువును మరోసారి పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 22 తేదీ వరకు గడువును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.. ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.. అక్టోబర్ 1 తేదీన ఆ శాఖ బదిలీల్లో నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో 150 మంది విద్యార్థులు వున్నారు.. అందులో 90 మంది అమ్మాయిలు, 60 మంది అబ్బాయిలు చదువుకుంటున్నారు.. కానీ, అమ్మాయిలు మూత్రవిసర్జనకు వెళ్లాంటే.. ఒక్కటే మరుగుదొడ్డి ఉంది.. అది కూడా అద్వాన్నంగా ఉన్న తప్పని పరిస్థితుల్లో వాడుకుంటున్నారు..