Fake Currency Notes: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నకిలీ నోట్ల ముఠాలు రెచ్చిపోతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని దొంగ నోట్లను మార్పిడి చేయడమే పనిగా పెట్టుకున్నాయి. నకిలీ నోట్లు ప్రింట్ చేసేందుకు అవసరమైన సామాగ్రిని చైనా నుంచి దిగుమతి చేసుకొని మరి చెలరేగిపోతున్నాయి. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు సైతం అవాక్కయ్యేలా నకిలీ నోట్ల ముఠాల వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి.. తాడేపల్లిగూడెంలో ఇటీవల రద్దీగా ఉండే వైన్ షాప్ వద్ద నకిలీ 500 రూపాయల నోట్లను చలామణి చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గుర్తించి స్థానికులు.. పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. కొంతమంది కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి నకిలీ నోట్లు ముద్రించడం వాటిని రద్దీగా ఉండే ప్రాంతాల్లో చాలామంది చేయడమే పనిగా పెట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్టుగా ముఠా గ్యాంగ్ సభ్యులందరినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి నకిలీ నోట్లు, ప్రింటింగ్ కి అవసరమైన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
నరసాపురంలో మరో ముఠా ఇదే తరహాలో రెచ్చిపోతుంది. ఏకంగా చైనా నుంచి కలర్ సెక్యూరిటీ పేపర్స్ దిగుమతి చేసుకుని ఆధునిక ప్రింటర్‌లు, స్కానర్‌ల సహాయంతో దొంగ నోట్లు ముద్రించేందుకు ప్రయత్నించిన మహ్మద్ ఇస్మాయిల్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మహ్మద్ ఇస్మాయిల్ ఖాన్ సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో దొంగ నోట్లు ముంద్రించి చెలామణి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాడు. ఇందుకు ఆలీబాబా వెబ్‌సైట్ ద్వారా చైనా నుంచి సెక్యూరిటీ కలర్ పేపర్‌లను రప్పించాడు. నోట్లు ముద్రణకు ఆధునిక టెక్నాలజీతో ఉండే ప్రింటర్, స్కానర్‌ను కొనుగోలు చేశాడు. గుట్టుగా కొంత పేపర్‌ను వినియోగించి 500 నోట్లను ముద్రించాడు. అయితే ఆ నోట్లు సక్రమంగా రాకపోవడంతో పేపర్‌లో లోపం ఉందని వాటన్నింటిని చించివేశాడు. అయితే నిందితుడు ఆలీబాబా వెబ్‌సైట్ ద్వారా సెక్యూరిటీ పే పర్‌ను దిగుమతి చేసుకున్న విషయాన్ని ఢిల్లీ కస్టమ్స్ అధికారుల నోటీసుకు వచ్చింది. వెంటనే ఢిల్లీ అధికారులు విజయవాడ కస్టమ్స్ అధికారులను అలర్ట్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని సన్ షైన్ స్కూలు వద్ద ఏటువంటి అనుమతులు లేకుండా చైనా నుండి రప్పించిన సెక్యూరిటీ కలర్ పేపర్ తో 500 దొంగ నోట్లు ముద్రిస్తున్న మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ ను విజయవాడ కష్టం అధికారులు అరెస్టు చేసి నర్సాపురం పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి 96 సెక్యూరిటీ కలర్ పేపర్లు , ప్రింటర్, స్కానర్ తో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు నర్సాపురం సీఐ యాదగిరి చెప్పారు. కొన్ని నోట్లు ప్రింటింగ్ సరిగా రాకపోవడంతో వాటిని చించేశాడు.. మిగిలిన 96 సెక్యూరిటీ కలర్ పేపర్ లు మిషనరీని ఇంట్లో భద్రపరుచుకున్నాడు. అయితే ఢిల్లీలోని కస్టమ్స్ అధికారుల అనుమతులు లేకుండా సెక్యూరిటీ కలర్ పేపర్ ను దిగుమతి చేసుకున్న విషయం తెలియడంతో విజయవాడ కస్టమ్స్ అధికారుల్ని అలర్ట్ చేశారు విజయవాడ నుంచి వచ్చిన బృందం ఇస్మాయిల్ ఖాన్ ఇంట్లో సోదాలు చెయ్యగా సెక్యూరిటీ కలర్ పేపర్ దొరికాయి. సీనియర్ కస్టమ్స్ అధికారి నాగభూషణం ఫిర్యాదుతో నిందితుని అరెస్టు చేసి సెక్యూరిటీ పేపర్ లు , దొంగ నోట్లు ముద్రించేందుకు రప్పించిన ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ యాదగిరి చెప్పారు.
Read Also: APPSC vs AP Government: గ్రూప్-2 మెయిన్స్‌పై గందరగోళం..! స్పందించని ఏపీపీఎస్సీ.. సీఎం అసంతృప్తి..!
ఈజీ మనీ కోసం దొంగ నోట్ల చలామణి ఇప్పుడు ఒక కుటీర పరిశ్రమగా నడిపేందుకు కొన్ని గ్యాంగులు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఇతర ప్రాంతాల నుంచి నోట్లు దిగుమతి చేసుకొని ఇక్కడ చలామణి చేయడం గతంలో జరిగేది. రూట్ మార్చిన కేటుగాళ్లు ఇప్పుడు నేరుగా చైనా నుంచి అవసరమైన సామాగ్రి దిగుమతి చేసుకొని మరి నకిలీ నోట్ల ముద్రణకు శ్రీకారం చుడుతున్నారు. వాటిని రద్దీ ప్రాంతాల్లో చలామని చేయడమే పనిగా పెట్టుకున్నారు. డబ్బు అవసరమైతే ప్రింట్ చేసుకోవడం అనుమానం రాకుండా వాటిని చలామణి చేయడం… ఈ తరహాలో మోసాలు ఎక్కువైపోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.. ఇప్పుడు అరెస్టు చేసిన గ్యాంగ్ సభ్యులు కొంతమంది మాత్రమే. త్వరలోనే మరింత మందిని తెరపైకి తీసుకొస్తామని పోలీసులు చెప్పుకొస్తున్నారు.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో నోట్లు తీసుకునే సమయంలో సామాన్యుల సైతం ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది..