గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా నదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేశారు.. దీంతో వరుసగా రెండో రోజూ కూడా గణేష్ నిమజ్జనాలు గోదావరిలో చేయడాన్ని నిలుపు వేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా నిమజ్జనానికి ఊరేగింపులతో గణేష్ విగ్రహాలు తీసుకుని వస్తున్న వాటిని పోలీసులు వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.
వయనాడ్‌లో ఇటీవల వరదలతో పాటు కొండచరియలు విరిగి పడిన ఘటనలో తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన యువతి జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆమెపై విధి మరోసారి కన్నెర్ర చేసింది. సర్వస్వం కోల్పోయి.. ఇప్పుడిప్పుడే గుండె నిబ్బరం చేసుకొని ముందుకు సాగుతున్న ఆమె జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. జీవితాంతం తోడునీడగా ఉంటానంటూ మాటిచ్చిన వ్యక్తిని విధి.. రోడ్డు ప్రమాదం రూపంలో బలితీసుకుంది. దీంతో అటు కుటుంబ సభ్యులను,…
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
రెడ్ బుక్ రాయడం గొప్పకాదు , రెడ్ బుక్ పేరుతో మా నేతలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నేను ఎప్పుడూ చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా వేధించలేదన్న ఆయన.. కానీ, ఇప్పుడు మా నేతలను వేధింపులకు గురిచేస్తున్నారు.. మీరు చూపించిన దారిలోనే నేను నడుస్తాను అంటూ వ్యాఖ్యానించారు..
నా దెబ్బకు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలో దిగే పరిస్థితికి వచ్చారు.. అంటూ వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఏలూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల విజయవాడలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడిందన్నారు.. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.. ఏడాదిలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం విజయవాడలో రెండు రోజుల్లో కురిసింది..…
కూటమి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను గుంటూరు జైలులో పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ అన్ని రకాలుగా వైఫల్యం చెందిందన్నారు.. చంద్రబాబు వైఫల్యంతో వరదల వల్ల 60 మంది చనిపోయారని ఆరోపించారు.. అందుకోసమే ఎప్పుడో జరిగిన ఘటనపై టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.. అసభ్య పదజాలంతో దూషించినా.. నేను సంయమనం పాటించా.. కానీ, కొందరు కోపంతో…
ఆంధ్రప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి చేరుకున్నాయి సెంట్రల్ టీమ్స్.. రాగానే మొదట.. రాష్ట్ర అధికారులతో సమావేశమై.. వరదల తీవ్రత.. నష్టంపై చర్చించారు.. దాదాపు రెండు గంటల పాటు ఏపీ అధికారులతో సమావేశమైంది కేంద్ర బృందం. ఇక, కాసేపట్లో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లనున్నాయి కేంద్ర బృందాలు.. బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన కొనసాగనుంది.. ఇవాళ బాపట్ల, కృష్ణా జిల్లాల్లో సెంట్రల్ టీమ్స్ పర్యటించనుండగా.. రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తూ..…
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి విక్రయం ఘటన కలకలం సృష్టించింది.. 1.90 లక్షల రూపాయలకు తన బిడ్డను విక్రయించారు చిన్నగంజాంకు చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి.. కొద్ది రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తన భార్య లక్ష్మిని డెలివరీ కోసం తీసుకెళ్లాడు భర్త సుబ్రహ్మణ్యం.. అయితే, ఆడ శిశువుకు జన్మనిచ్చిన సుబ్రమణ్యం భార్య లక్ష్మి కన్నుమూసింది.. గతంలోనే లక్ష్మికి ఎనిమిది మంది సంతానం ఉంది.. మరోవైపు.. అదే ఆస్పత్రిలో డెలివరీ కోసం భట్టిప్రోలుకు చెందిన మీరాభి చేరింది.. కానీ, డెలివరీ తర్వాత మీరాభికి…