గోదావరిలో పైపులైను నుండి గ్యాస్ లీక్ కలకలం సృష్టించింది.. యానాం దరియాలతిప్ప కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య ప్రాంతంలో గోదావరిలో చమురు సంస్థలు వేసిన పైపులైను నుండి గ్యాస్ లీకవడంతో కలకలం రేగింది.. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప ప్రాంతం నుండి యానాం దరియాల తిప్ప మీదుగా గోదావరిలో వేసిన పైపులైను నుండి గ్యాస్ లీకు కావడంతో.. గోదావరిలో సుడులు తిరుగుతూ, బుడగలు వేస్తూ నీరు పైకి ఉబికి వచ్చింది.
తిరుమల లడ్డులో కల్తీ నెయ్యుని వినియోగించారని.. గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ బోర్డు ఆమోదించిన టెండర్ వల్ల కల్తీ నెయ్యి వినియోగం జరిగిందనే విషయాన్ని ఈవో శ్యామల రావు నిర్ధారించారు. జాతీయ స్థాయిలో పేరొందిన NDDB ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. దీనిపై రాజకీయంగా దుమారం రేగుతోంది. అధికార టీడీపీ.. మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ అపచారం నువ్వు చేశావంటే నువ్వు చేశావని దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేశాయి.. అయితే.. వరద ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణ నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చెక్కులు అందించారు పలువురు దాతలు..
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు.. సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు ముఖ్యమంత్రి.. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించినవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు..
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న విషయం నా మనసును కలచివేసిందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఇలాంటి నేరం ఎవరూ.. ఎప్పుడూ భగవంతుడు విషయంలో పాల్పడి ఉండరని వ్యాఖ్యానించారు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తిరుమల పవిత్రతను తగ్గించేప్రయత్నం చేశారు.. టీటీడీని రాజకీయ కార్యకలాపాలకు వాడుకున్నారు అంటూ మండిపడ్డారు..
అప్పుడు యువగళం... ఇప్పుడు దండయాత్ర.. అని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.. యువగళం 100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించడం సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేను అన్నారు.
తిరుమల లడ్డూల వివాదంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడుతున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలిసి ఆవేదన చెందాను అన్నారు.. అయితే, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.. గత ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు
శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా రోజులు తరువాత మీడియా ముందుకు వచ్చిన రమణధీక్షితులు టీటీడీ లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరగడం మహా పాపం అన్నారు.. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వామివారికి నివేదించే ప్రసాదాల నాణ్యత, పరిణామాలు దిట్టం మేరకు జరగడం లేదని గత ఐదు సంవత్సరాలుగా తాను టీటీడీ ఈవో.. చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లిన సరైన స్పందన లేదని.. ఇప్పటికైనా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడం మంచి పరిణామం అంటూ…