Kurnool Crime: కర్నూలులో దారుణం.. బాలికపై అత్యాచారయత్నం.. తిరస్కరించడంతో పురుగులమందు తాగించి..!
- కర్నూలు జిల్లాలో దారుణం..
- ప్రేమోన్మాది చేతిలో బాలిక బలి..
- ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారయత్నం..
- ప్రతిఘటించిన బాలికకు పురుగుల మందు తాగించి పరార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Crime: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో బాలిక బలైంది. తనను ప్రేమించాలంటూ గత కొంత కాలంగా ఓ బాలిక వెంట పడుతోన్న యువకుడు.. ఎవరూ లేని సమయం చూసుకొని ఆ ఇంట్లోకి చొరబడ్డాడు.. ప్రేమించాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో.. బలవంతంగా ఆమె నోట్లు పురుగుల మందు పోసి పరారయ్యాడు.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
Read Also: IND vs NZ: టీమిండియాకు శుభవార్త.. నేడు బ్యాటింగ్‌కు పంత్!
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అశ్విని అనే ఇంటర్ విద్యార్థిని నోట్లో పురుగుల పోసి ప్రేమోన్మాది చిన్న వీరేశ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పత్తికొండ మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అశ్విని.. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చింది. ప్రేమించకపోతే చంపేస్తానని చిన్న వీరేశ్.. సదరు బాలికను బెదిరించారు. ఇక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.. ఆ బాలిక ప్రతిఘటించడంతో బలవంతంగా పురుగుమందు తాగించాడు… అయితే, పెనుగులాటలో వీరేశ్ కు కూడా గాయాలయ్యాయి. ఇక, పొలం పనుల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చావు బతుకుల్లో కనిపించిన అశ్వినిని చూసి షాక్ తిన్నారు.. వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అశ్విని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో.. కన్నీరు మున్నీరవుతున్నారు.. ప్రేమ పేరుతో తన కూతురు వేధింపులకు గురి చేసి.. అత్యాచార యత్నం చేసి ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..