జెమిలి ఎన్నికలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ జెమిలి ఎన్నికలకు సిఫార్సు చేయడాన్ని అభినందించారు. జెమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు.
ఏపీలో టూరిజానికి పెద్దపీట వేస్తున్నాం.. గత వైసీపీ ప్రభుత్వం టూరిజాన్ని పూర్తిగా నాశనం చేసింది అన్నారు మంత్రి కందుల దుర్గేష్.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నాం.. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేస్తాం అన్నారు.. ఇప్పటికే ఎంట్రీ లను ఆహ్వానిస్తున్నాం అన్నారు..
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారట.. రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారట జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను.. ఈ నెల 22వ తేదీన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టచ్‌లోకి వెళ్లారట ఉదయభాను.. రేపు నియోజక వర్గంలో కార్యకర్తలతో సమావేశం కానున్న ఉదయభాను.
కుక్కులు మొరగడం .. అతడి వెంట పడడం.. దానికితోడు హిందీ మాట్లాడుతుండంతో.. యువకుడిని దొంగగా భావించి గ్రామస్థులు పట్టుకుని కట్టేసిన ఘటన సోమందేపల్లి మండలం చాకర్లపల్లిలో చోటు చేసుకుంది.. గ్రామానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టిన తరువాత అసలు విషయం వెలుగుచూసింది.
ఇవాళ్టి నుంచి ఏపీలో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమల్లోకి రాబోతోంది.. ఉచిత ఇసుక పోర్టల్‌ను ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.. అధికారులు నుంచి ఇసుక రవాణాదారుల ఎవ్వరూ తప్పిదాలకు పాల్పడకుండా పోర్టల్ రూపకల్పనకు పూనుకుంది సర్కార్.
రూరల్ వాటర్ సప్లై, జల్ జీవన్ మిషన్ పై ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇంటింటికీ కుళాయి నీరు అందించే అంశంపై చర్చించనున్నారు.. కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ తాగు నీరు అందించేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది..
ఆగస్టు 15వ తేదీన తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించిన చంద్రబాబుసర్కార్.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధమైంది.. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రెండో విడత అన్న క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. సెక్రటేరీయేట్ వద్దనున్న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.