TTD: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. తిరుమలలో శ్రీవారి దర్శనానికి.. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. ఇప్పటికే ఈ ఏడాది ఆర్జిత సేవా టికెట్ల కోటా పూర్తి కాగా.. వచ్చే ఏడాది టికెట్ల కోటాను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందులో భాగంగా ఈ రోజు జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.. మరోవైపు.. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి (ఈ నెల 21వ తేదీ) ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది.. ఇక, ఎల్లుండి (21వ తేదీ) మధ్యాహ్నం లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది టీటీడీ..
Read Also: Karmayogi Saptah: నేడు నేషనల్ లెర్నింగ్ వీక్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ వెల్లడించింది.. ఇక, నిన్న శ్రీవారిని 61,576 మంది భక్తులు దర్శించుకున్నారు.. 23,412 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.