ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు మంత్రి నారా లోకేష్.. విజయవాడలో సీఐఐ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడారు.. 70 మంది సీఈవోలు వచ్చిన ఈ సమావేశంలో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను అన్నారు..
వివాదంగా మారిన తిరుమల లడ్డూ ఇష్యూ్కు ఇక్కడితో ముగింపు పలకాలని రాజకీయ పార్టీలను, మీడియాకు విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అయితే, విచారణ జరిపించి నిజాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమల లడ్డూపై రాజకీయాలు చేయడం.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడం అభ్యంతరకరం అన్నారు.. ప్రజల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.
ఆ ఏడుకొండల వాడే నాతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమో! ఆ దేవుడే నా నోటినుంచి నిజాలు చెప్పించాడేమో..? మనం నిమిత్త మాత్రులం. దేవుడే అన్నీ చేయిస్తాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు..
విజయవాడ తూర్పు నియోజకర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ కన్నుమూశారు.. ఆయన వయస్సు 72 ఏళ్లు.. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోన్నర ఆయన.. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు విడిచారు.. అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్తో ఫోన్లో మాట్లాడి.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫ్లెక్సీ రగడ మొదలైంది.. ఒంగోలు చర్చి సెంటర్ లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలోకి ఆహ్వానిస్తూ కొందరు ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. అయితే, వాళ్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనసేన నేతలతో పాటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు పెట్టారు.. బాలినేని ఫోటోలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు కలిపి పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు.. ఆ ఫ్లెక్సీలను తొలగించారు.
మానవత్వం మంట గలిపి మానవ సంబంధాలకు విలువలు లేకుండా సభ్యసమాజంలో చివరకు శిశువును సైతం విక్రయించే దారుణానికి ఒడిగట్టారు. దత్తత పేరుతో శిశువును కొనుగోలు చేసిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే గుమ్మఘట్ట మండలంలోని నేత్రపల్లి గ్రామానికి చెందిన బళ్లారి రూపమ్మకు 15 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. ఆమెకు అంతకు ముందు ఆరేళ్ల బాలిక కూడా ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెట్టారు విష్ణుకుమార్ రాజు... కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ పాతాళానికి జారిపోవడం ఖాయమన్న ఆయన.. దేవుడిని మోసం చేసిన పార్టీలో ఉండాలో వద్దో అక్కడ వున్న నాయకత్వం ఆలోచించుకోవాలని సూచించారు. వైసీపీని వీడి తమకు అనుకూలంగా ఉన్న పార్టీలో చేరాలని నేతలకు సూచించారు విష్ణుకుమార్ రాజు.
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు.. బాధితురాలిగా ఉన్న లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి.. ఆమెపై దాడి చేసినందుకు చర్యలకు సిద్ధం అవుతున్నారట పోలీసులు.