AP Crime: పెదకాకానిలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. హైదరాబాద్‌లో ఒకే కంపెనీలో పని చేస్తున్న మహేష్, శైలు.. ప్రేమలో పడ్డారు.. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.. అయితే, తమ ప్రేమకు పెద్దలు అడ్డుగా వస్తారన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఈ ఘటన రెండు కుటుంబాల్లో.. రెండు విలేజ్‌లలో విషాదంగా మారాయి..
Read Also: Jharkhand Assembly Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, మిత్రపక్షాల సీట్ల ఖరారు
గుంటూరు జిల్లాకు చెందిన మహేష్, కృష్ణా జిల్లాకు చెందిన శైలు.. హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు.. అక్కడ ప్రారంభమైన వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి పెద్దలకు కనపడకుండా వెళ్లిపోయారు.. దీంతో.. యువతి సైలు కుటుంబ సభ్యులు నందిగం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రేమజంట.. తమ ప్రేమకు పెద్దలు అడ్డుగా వస్తారని భావించి, భయపడి ఈ తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ రోజు తెల్లవారుజామున తన సోదరికి ఫోన్ చేసిన శైలు.. తమ ప్రేమను మీరు ఒప్పుకోరని, పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారని.. అందుకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పింది.. ఆ తర్వాత ప్రియుడు మహేష్ తో కలిసి ఆత్మహత్య చేసుకుంది.. అయితే, తమతో ప్రేమ వ్యవహారం ముందే చెప్పి ఉంటే ఆత్మహత్యల వరకు రానిచ్చేవాళ్లం కాదని అంటున్నారు మృతుల బంధువులు.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కి చేరుకున్న ప్రేమ జంట మృత దేహాలను తరలించారు.. ఏదేమైనా.. ప్రేమించుకున్నారు సరే.. ఇంట్లో వాళ్లకు చెప్పకుండానే.. వెళ్లిపోయారు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఒప్పుకోరనే భయంతో.. తొందరపాటులో ఆత్మహత్య చేసుకోవడం.. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది..