TDLP Meeting: టీడీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ప్రజాప్రతినిధులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని స్పష్టం చేసిన ఆయన.. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే.. వైసీపీకి మనకి తేడా లేదనుకుంటారని తెలిపారు.. అయితే, చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది.. అలాగే ఎన్డీఏలో ఉన్న ఏ కార్యకర్త తప్పు చేసినా.. ఎవరినైనా తిట్టినా.. సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందని హెచ్చరించారు.. ప్రధాని మోడీని చూసి అందరం నేర్చుకోవాలి.. ఆయన పట్టు దల వల్లే మూడు సార్లు పీఎం అయ్యారు.. గుజరాత్ లో ఆరు సార్లు గెలిచారు.. దేశంలో ఎవరికీ రాని విజయం మోడీకే వచ్చింది. దాని వెనుక కఠోర శ్రమ, క్రమశిక్షణ ఉంది.. ఎక్కడా ఆయనా తప్పు చేయలేదు.. ఆయన పార్టీని చేయనీయలేదు.. ఆ విషయాన్ని అందరం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
Read Also: Fire Accident: ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఐసీయూలో రోగి మృతి
ఇక, వైసీపీ చేయని తప్పులు లేవు… ఎందుకు ఎన్నికల్లో 11 కు పడిపోయారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.. మనం నిలబడ్డాం నిలదొక్కుకున్నాం.. 93 శాతం సీట్లు వచ్చాయంటే.. అందరం గుర్తు పెట్టుకోవాలి.. విదేశాల నుంచీ వచ్చి మరీ మనల్ని గెలిపించారు.. ఒక నాయకుడు జైలుకు వెళ్లాడు… ఒక నాయకుడు టార్చర్ అనుభవించాడని గుర్తుచేశారు.. ఏ కార్యకర్త తప్పు చేసిన అది సీఎం మీద పడుతుంది.. మీ ప్రవర్తన కూడా పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంది.. అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. 7 శ్వేత పత్రాలు ముందుగానే ఇచ్చాం.. సహజవనరులు దోచుకున్నారు గత ప్రభుత్వంలో అన్నారు.. నిన్న హిందూపూర్ లో జరిగిన నేరం వెనుక గంజాయి బ్యాచ్ లే ఉన్నాయి.. FRBM లేదు… కొంతవరకూ కేంద్రం సహకరించింది కనుక నిలబడగలిగాం.. NDA కూటమి ఉంటే తప్ప మనం నిలబడే అవకాశం లేదు.. ఈ సమావేశం పట్ల రాష్ట్రం మొత్తం ఎందుకు ఆసక్తి కనబరుస్తోందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలి.. చేసిన పనుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పార్టీ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Kishan Reddy: మూసీ సుందరీ కరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చడం న్యాయం కాదు..
ఏ నమ్మకంతో ప్రజలు మనకు ఓటేశారో ఆ నమ్మకాన్ని అంతా నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు.. ఐదేళ్లు తీవ్రంగా నష్టపోయి, కష్టనష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తల బాధను అర్థం చేసుకోవాలి.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా.. అధికారుల సహా వ్యవస్థలన్నీ నాశనమైన పరిణామాలు గతంలో చూడలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.. వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించటం, పరిమిత వనరుల కారణంగా అన్నీ సరిచేయటానికి సమయం పడుతోందన్న ఆయన.. ఏ శాఖలోనూ సరైన ఆడిట్ జరగలేదు.. కేంద్ర నిధుల్ని సైతం ఇష్టానుసారం మళ్లించేశారు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే భయంకరమైన యాక్ట్ తెచ్చారు అన్నారు.. అయితే, ప్రతీ నియోజకవర్గం లో ఒక అన్న క్యాంటీన్ రావాలి.. డిసెంబర్ నాటికి స్కిల్ సెన్సస్ అవుతుంది. నెల మొదట్లోనే పెన్షన్లు, జీతాలు ఇస్తున్నాం.. పాత మద్యం దోపిడీలుపై చర్యలు తీసుకుంటూనే కొత్త మద్యం పాలసీలు తెచ్చాం.. ఇసుక పాలసీ లో మార్పులు తెచ్చాం.. ఇప్పటికే మద్యం వ్యాపారాలలో ఉన్నావారు మినహా ఎవ్వరూ అందులోకి వెళ్ళకుండా డిసిప్లీన్ తో ఉండాలని స్పష్టం చేశారు.. విజయవాడ వరదల్లో రాత్రింబవళ్ళు పని చేసాం.. గత ప్రభుత్వం చేసిన సమస్యల వల్ల బుడమేరు కు ఫ్లడ్ వచ్చింది.. విజయవాడే ఒక చెరువులా మారిపోయిందని గుర్తుచేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..