ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి.. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని కృష్ణా నది, బుడమేరు వరద అతలాకుతలం చేసింది.. పూర్తిస్థాయిలో సహాయక చర్యలు నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు నష్ట పరిహారం పంపిణీపై దృష్టిసారించింది.. ఈ రోజు నాలుగు లక్షల మంది బాధితుల ఖాతాల్లో రూ. 602 కోట్లు జమచేసింది ప్రభుత్వం..
వరద సాయం ఏ మేరకు అందిందనే అంశంపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు.. ఇంకా సెటిల్ కాని క్లైమ్లను ఈ నెల 30వ తేదీలోగా సెటిల్ చేయాలని ఆదేశించారు.. ఈ నెల 30వ తేదీని డెడ్ లైన్గా పెట్టుకుని పని చేయాలన్నారు.. వరద ముంపులో దెబ్బతిన్న వాహనాల భీమా క్లెయిమ్ల చెల్లింపు, మరమ్మతులు, గృహోపకరణాల మరమ్మతులు, బ్యాంకు రుణాలు రీ షెడ్యూల్ పై చర్చ సాగింది.. 11 వేల వాహనాల క్లెయిమ్లు వచ్చాయని సీఎంకు తెలిపారు అధికారులు.. ఇప్పటికీ 6500 క్లెయిమ్లు పరిష్కరించామని అధికారులు…
వరద బాధితులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు బాధితుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసింది.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో వరద బాధితులకు పరిహారం పంపిణీలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సంభవించిన విపత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఎంత వరకు సాయం చేయాలో అంత వరకు చేశాం అన్నారు.. నాలుగు లక్షల మందికి రూ. 602 కోట్లు బాధితుల అకౌంట్లలో వేశామని తెలిపారు..
భీమిలి ఎర్రమట్టి దిబ్బలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై హైకోర్టులో పిల్ (WP(PIL) 155/2024) దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్.. దీనిపై విచారణ జరిగిన ఏపీ హైకోర్టు.. ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతూ విధ్వంసం చేస్తున్న ప్రదేశం తీరప్రాంత క్రమబద్ధీకరణ మండలి (CRZ) జోన్-1, జోన్-3 మరియు వారసత్వ సంపద (జియో హెరిటేజ్) గల సున్నితమైన పరధిలోనికి వస్తుందని పేర్కొంది..
అనంతపురం జిల్లాలో రథం దహనం కేసు సంచలనం సృష్టించిన విషయం విదితమే కాగా.. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు.. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో నిన్న శ్రీరాముడి గుడికి సంబంధించిన రథానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బొడిమల్ల ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ని అరెస్టు చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యుడి నిర్వాకం కలకలం సృష్టిస్తోంది.. గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే.. ఏ కంగా మూత్రనాళం తొలగించాడు వైద్యుడు.. అయితే, మూత్రం రాకపోవడంతో.. ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.
వైసీపీ కంచుకోటలో పాగా వేసేందుకు కూటమి నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. అసంతృప్తిగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి రావడానికి ద్వారాలు తెరిచారట. అయితే, కడప కార్పొరేషన్.. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయినప్పటికీ నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. 2006లో కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ అయింది. దీనికోసం కడప పట్టణానికి సమీపంలో ఉన్న పలు గ్రామాలను మెడ్జ్ చేశారు.