ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ రోజు స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు.. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి నేడు స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీశైలం దేవస్థానం అధికారులు వెల్లడించారు..
ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కలకలం రేగింది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. అయితే, ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల చించివేత ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు ఓ కీలక కేసులో తీర్పు వెలువరించడంతో పాటు.. పలు కీలక పిటిషన్లపై విచారణ చేపట్టనుంది.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో నేడు తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు..
ఒంగోలు మాజీ ఎంపీ, దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు.. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందారు..
కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించడం అడవి శాఖ అధికారులు ధ్రువీకరించడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దివాన్ చెరువు ప్రాంతం నుంచి ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్లు పాద ముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..?
నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేసింది టీడీపీ.. 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం.. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది.. 11 మంది క్లస్టర్ ఇంఛార్జీలకు పదవులు. ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి. ఆరుగురికి యూనిట్ ఇంఛార్జీలకు పదవులు. 20 కార్పొరేషన్లకు ఛైర్మెన్లు, ఒక కార్పొరేషనుకు వైస్ ఛైర్మెన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించింది కూటమి ప్రభుత్వం.
తిరుమల లడ్డూ వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తప్పులు చేసినవారు ఎవరు అయినా సరే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.. వైఎస్ జగన్ మొదటి నుండి తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బ తీస్తువచ్చారని ఆరోపించారు.