కొత్త ఐటీ పాలసీపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్.. అందులో భాగంగా ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీని ఐటీ హబ్ చేసేలా పాలసీ రూపకల్పన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఏపీలో ఏఐ కంపెనీల స్థాపనకు ప్రొత్సహాకాలు ఇవ్వాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తిరుపతిలో నిరసనలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.. వైఎస్ జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకొనే ప్రక్రియ.. జగన్ విషయంలో ఆయన మతాన్ని, ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాదిది. వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడవద్దు.. ఆ ప్రక్రియపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.. ఇక, అధినేత వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటన,…
ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డిని నేడు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు. హైదరాబాద్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఏపీ ఏసీబీ అధికారులు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి..
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠ రేపుతోంది. శ్రీవారి దర్శనార్థం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారాయన. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల పయనమవుతారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రేపు ఉదయం పదిన్నరకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ కు ఘన స్వాగతం పలకడానికి వైసీపీ శ్రేణులు సిద్దమవుతున్నారు.
గంజాయి అమ్మేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి... గంజాయి అమ్మేవారిపై పోలీసుల సహకారంతో పీడీ యాక్ట్ నమోదు చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు..
మీరు చేస్తున్న ఆరోపణలు నిజాలు అని నిరూపిస్తే వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇస్తారని పేర్కొన్నారు వంగ గీత... తిరుపతి లడ్డూ విషయంలో చేస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. దేవుడితో ఆటలు వద్దు అని హెచ్చరించారు. వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వం ఇటువంటి ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు వంగ గీత..