Cyclone Dana: “దానా” తీవ్ర తుఫాన్ తీరం దాటింది.. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల మధ్య.. హబాలిఖాతి నేచర్ క్యాంప్(భిత్తర్కనిక) మరియు ధమ్రాకు సమీపంలో తీరం దాటేసింది తుఫాన్ దానా.. ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ మరో 2-3 గంటల పాటు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు మధ్యాహ్నం నుంచి క్రమంగా బలహీనపడుతుందని అధికారులు చెబుతున్నారు.. ఇదే సమయంలో.. ఉత్తరాంధ్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ.. ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండానలి సూచించారు.. విపత్తుల నిర్వహణ సంస్థ.. మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్..
Read Also: Gaza- Israel War: గాజాలో ఇజ్రాయెల్ దాడులు.. 17 మంది పాలస్తీనియన్ల మృతి..
ఇక, దానా తీవ్ర తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిచింది.. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతంగా ఉంటుందని.. చెదురుమదురుగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఉత్తర, దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉండగా… కొన్నిచోట్ల చాలా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ.. ఇక రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురువొచ్చని చెప్పుకొచ్చింది..