CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ హైవే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమీక్షకు రాష్ట్ర, నేషనల్ హైవే అధికారులు, వివిధ ప్రాజెక్టుల పనులు చేస్తున్న ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 129 నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి.. 3,300 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు.. రాష్ట్రంలో మొత్తం రూ. 76 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నట్లు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు తెలిపిన అధికారులు.
Read Also: YS Jagan: డయేరియా మృతుల కుటుంబాలకు పరామర్శ.. ఆర్థిక సాయం ప్రకటించిన జగన్
ఇక, ప్రాజెక్టులవారీగా నేషనల్ హైవే పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర, నేషనల్ హైవే అధికారులు, పనులు చేస్తున్న ఆయా ఏజెన్సీల ప్రతినిధులు హాజరుకాగా.. చేపట్టిన పనులు.. చేపట్టాల్సిన పనులు.. వివిధ దశల్లో ఉన్న జాతీయ రహదారుల పనుల పురోభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష చేశారు.. బెంగళూరు – విజయవాడ ఎకనామిక్ కారిడార్.. విజయవాడ – నాగపూర్, రేణిగుంట – నాయుడుపేట, ఔటర్ రింగ్, అమరావతిని కలిపే గుంటూరు – అనంతపురం జాతీయ రహదారి.. ఇలా పలు జాతీయ రహదారుల పనుల పురోగతిపై సమీక్షించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..