విద్యాసాగర్ రిమాండ్ పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..
కరువుతో అల్లాడుతోంది రాయలసీమ. కరువు సీమలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోసం కడపకు కూత వేటు దూరంలోని కొప్పర్తిలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశాయి గత ప్రభుత్వాలు. భారీ పరిశ్రమలు వస్తాయి నిరుద్యోగ సమస్య తీరుతుంది అని ఆశల పల్లకిలో ఊరేగుతున్న నిరుద్యోగ యువతకు ఎన్డీఏ ప్రభుత్వం చేదువార్త అందించింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పరిశ్రమను విజయవాడలో ఏర్పాటు చేసేలా కేంద్రానికి ప్రభుత్వం నివేదికలు పంపిందట.. రాష్ట్ర రాజధాని అమరావతిలో దాదాపు 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో…
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.. తాను జనసేనలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తన అభిమానులకు సూచించారు..
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రోజు అర్థరాత్రి అస్వస్థతకు గురుకావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. స్వల్ప గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరినట్టుగా చెబుతున్నారు.. అయితే, గ్యాస్ నొప్పి వల్ల ఆసుపత్రిలో చేరినట్టుగా పేర్కొన్నారు రాధా సన్నిహితులు
న్యూయార్క్ లో పర్యటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. ఈ పర్యటనలో భాగంగా వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం అయ్యారు.. ప్రపంచ బ్యాంకు 2030 నీటి వనరుల ప్రోగ్రామ్ మేనేజర్ మరియు సహజ పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్‌తో ఏపీ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, పవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఈ రోజు కీలక సమీక్షలు నిర్వహించనున్నారు.. క్రీడా, యువజన సర్వీసులపై సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. యువతకు ఉపాధి, పారిశ్రామిక రంగంలో.. యువతకు ప్రోత్సాహం, యువతకు ప్రొత్సాహం ఇచ్చేలా స్టార్టప్ కంపెనీల ఏర్పాటుపై చర్చించనున్నారు..
వెంటనే విధుల్లో చేరాలని పీహెచ్సీ వైద్యులను కోరారు ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్.. మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్‌లో బుధవారం పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో మూడో విడత చర్చలు జరిపిన మంత్రి..
ఈ రోజు జనసేన పార్టీలో కీలక నేతలు చేరబోతున్నారు.. సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదబభాను, కిలారి రోశయ్య కూడా ఈ రోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు..
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టంగా పూర్తి చేశారు.. చాకలిమండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు కుంకుమల సారె సమర్పించారు. మిరాశీదారుల సారెతో శ్రీ పోలేరమ్మవారికి అమ్మవారి సేవకులు ప్రాణప్రతిష్ట గావించారు.