వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అందరు కూడా జనసేనకి, టీడీపీలోకి చేరుకుంటున్నారు.. మీరు ఏకాకి గా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు గంటా శ్రీనివాసరావు..
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పాలకులు గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయినా చోద్యం చూస్తూ కూర్చున్నారు.. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఎనిమిదిన్నర కోట్ల రూపాయాల నిధులు కేటాయించి.. గేట్లు మరమ్మత్తులు చేపడుతున్నాం అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నేతలు చాలా మంది నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు.. అయితే, వారికి గుడ్న్యూస్ చెబుతూ.. వివిధ నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసింది చంద్రబాబు సర్కార్.. వివిధ కార్పొరేషన్లకు చైర్పర్సన్లను నియమించింది.. ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ చేసింది.. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రధాన్యత కల్పించింది ప్రభుత్వం.. ఇక, నామినేటెడ్ పోస్టుల భర్తీలో టీడీపీతో…
తిరుమల లడ్డూ వివాద ఘటనను సుప్రీంకోర్టు సుమోటో గా తీసుకుని విచారణ చేయాలని కోరారు సీపీఐ నారాయణ.. ప్రజ సమస్యలు అన్ని పక్కనపెట్టి లడ్డూ సమస్య మొదటికి వచ్చిందన్న ఆయన.. కమ్యూనిస్టులు.. భక్తులకు, దేవాలయాలకు వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు.. అయితే, భక్తుల మనోభావాలను దెబ్బకోట్టి విధంగా పరిస్థితిలు వచ్చాయి.. జగన్ రివర్స్ టెండర్లు పెట్టడం వల్ల తీవ్రమైన నష్టం కలిగింది.. అసలు ఎందుకు చెన్నై డైరీకి నెయ్యి కాంట్రాక్టు ఇచ్చారు..? తక్కువ రేటుకు నెయ్యి వస్తుందని.. లడ్డూలో ఎక్కడలేని దరిద్రాలు కలిపి…
అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి శ్రీ రామాలయం రథానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని దుండగులు. అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన పై స్థానికులు గమనించి మంటలను ఆర్పి వేయడంతో అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది. రథం దగ్ధం అయిన ఘటనను తీవ్రంగా ఖండించారు సీఎం చంద్రబాబు.. అధికారులతో మాట్లాడిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు.. అయితే, అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు తెలిపిన జిల్లా అధికారులు.. దీంతో.. ఘటన పై సమగ్ర దర్యాప్తు…
మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిందనే బాధ.. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి.. ఇక భగవంతుడే చూసుకుంటాడు అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం కాకరేపుతోనున్న వేళ.. ట్విట్టర్ (ఎక్స్)లో స్పందించిన ఆయన.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడిని దర్శించుకోవచ్చు. అయితే, ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్…
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ.. ఆలయం వంటి విద్యాలయాన్ని అకృత్యాలకు వేదికగా చేసుకున్నాడో ఘనుడు. అభం శుభం తెలియని విద్యార్థినులపై వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.. తన సెల్ ఫోన్ లో బ్లూ ఫిల్మ్ చూపిస్తూ చిన్నారుల శరీరంపై చేతులు వేసి నొక్కుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు..
తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంపై పెద్ద దుమారమే రేగుతోంది.. ఈ నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, దీక్షలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.. దుర్గమ్మ టెంపుల్ మెట్లను స్వయంగా శుభ్రం చేసిన పవన్.. ఆ తర్వాత వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టారు.. ఇక, అమ్మవారిని దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రాయశ్చిత్త దీక్షకు ఇవాళ మూడోరోజు.. మేం…
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి జలపాతంలో కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థి హరదీప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 40 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి.. వర్షం కారణంగా కొండవాగులు పొంగిపొర్లడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.