టెంపుల్ సిటీలో కలకలం.. హోటళ్లకు బాంబు బెదిరింపులు..
టెంపుల్ సిటీ తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది.. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్ కు గురువారం ఈమెయిల్‌లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. తమిళనాడులో ఉగ్రవాది జాఫర్ సాదిక్ కు జైలుశిక్ష పడింది. ఆ శిక్ష పడేందుకు ప్రభుత్వం తరపున తమిళనాడు సీఎం స్టాలిన్ సహకారం అందించారు. సీఎం కుటుంబంతో పాటు తమిళనాడులోని కొన్ని పాఠశాలల్లో పేలుళ్లకు ఐఎస్ఐ పూనుకొందని అందులో భాగంగా తిరుపతిలోని నాలుగు ప్రైవేటు హోటళ్లను పేల్చివేస్తామని హెచ్చరించారు. హోటళ్ల యాజమానుల సమాచారంతో వెంటనే పోలీసులు తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఈమెయిల్స్ పై అలిపిరి, తిరుపతి ఈస్ట్ పీఎస్‌లలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. మరోవైపు.. స్టార్ ఎయిర్‌లైన్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి.. స్టార్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఎస్ 5-154 విమానానికి సోషల్ మీడియాలో బాంబు బెదిరింపులు చేశారు.. అదమ్ నాన్ జా 333 పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్ నుండి ఈ బెదిరింపు మెసేజ్ వచ్చింది.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్.. ఉత్తరాంధ్రకు హెచ్చరికలు
“దానా” తీవ్ర తుఫాన్ తీరం దాటింది.. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల మధ్య.. హబాలిఖాతి నేచర్ క్యాంప్(భిత్తర్కనిక) మరియు ధమ్రాకు సమీపంలో తీరం దాటేసింది తుఫాన్ దానా.. ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ మరో 2-3 గంటల పాటు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు మధ్యాహ్నం నుంచి క్రమంగా బలహీనపడుతుందని అధికారులు చెబుతున్నారు.. ఇదే సమయంలో.. ఉత్తరాంధ్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ.. ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండానలి సూచించారు.. విపత్తుల నిర్వహణ సంస్థ.. మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్.. ఇక, దానా తీవ్ర తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిచింది.. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతంగా ఉంటుందని.. చెదురుమదురుగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఉత్తర, దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉండగా… కొన్నిచోట్ల చాలా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ.. ఇక రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురువొచ్చని చెప్పుకొచ్చింది..
కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది.. వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలోని కృష్ణాబేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు… జూరాలకు వరద కొనసాగుతుండగా.. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 71,713 వేల క్యూ సెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 76,667 క్యూ సెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1043.865 ఫీట్లుగా ఉంది.. జూరాల పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటి నిల్వ 8.949 టీఎంసీలుగా ఉంది.. ఇక, ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రలలో 11 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.. ఎత్తి పోతల పథకాలకు కూడా నీటి విడుదల చేస్తున్నారు. ఇక, శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది.. జలాశయం 5 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేశారు అధికారులు.. ఇన్ ఫ్లో 1,59,089 క్యూసెక్కులు అయితే.. ఔట్ ఫ్లో 2,07,820 క్యూసెక్కులుగా ఉంది.. పూర్తి్స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులు ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం నీటినిల్వ 215.8070 టీఎంసీలకు చేరి నిండుకుండలా మారింది శ్రీశైలం.. ఇక, కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంతో పాటు ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలోనూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.. మరోవైపు.. శ్రీశైలం డ్యామ్ నుంచి పెద్దస్థాయిలో నీటి విడుదలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.. దీంతో.. 22 క్రస్ట్ గేట్స్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 2,08,863 క్యూసెక్కులు అయితే.. ఔట్ ఫ్లో 2,25,463 క్యూసెక్కులుగా ఉంది.. ప్రస్తుత నీటి మట్టం 589.70 అడుగులు కాగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 311.4886 టీఎంసీల నీరు ఉంది.. నాగార్జున సాగర్ నుంచి గేట్ల ద్వారా నీటి విడుదలతో పాటు పంట కాల్వలకు కూడా నీటిని వదులుతున్నారు అధికారులు..
పర్యాటకులకు శుభవార్త.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు..
తెలంగాణ టూరిజం రోడ్ కమ్ రివర్‌క్రూజ్ టూర్ (ROAD CUM RIVER CRUISE TOUR) పేరుతో హైదరాబాద్-శ్రీశైలం- సోమశిల-హైదరాబాద్ వరకు ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ లింక్ ద్వారా వాటి వివరాలు సేకరించవచ్చని తెలిపింది. https://tourism.telangana.gov.in/blogpage?id=14 క్లిక్ చేస్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మొత్తం రెండు రోజుల పాటు టూర్ నిర్వహిస్తారు. ప్రతి శని, ఆదివారల్లో ఈ టూర్ ను ఉంటుందని తెలిపారు. శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్‌లో చేపట్టనున్న ఈ పర్యటన ఆహ్లాదకరంగా ఉంటుందని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని సోమశిల నుండి శ్రీశైలం వరకు సింగిల్ రైడ్ , రౌండప్ క్రూయిజ్ జర్నీ ధరలు కూడా ప్రకటించారు.
నేడు భద్రాద్రి.. ఖమ్మం జిల్లాల్లో గవర్నర్ పర్యటన..
నేడు భద్రాద్రి.. ఖమ్మం జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ పర్యటించనున్నారు. ఇవాళ భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని గవర్నర్ దర్శించుకోనున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఖమ్మం చేరుకుని కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, కవులు, కళాకారులతో సమావేశం కానున్నారు. భద్రాచలంలో పర్యటనకు వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే.. గురువారం సాయంత్రం బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్న ఆయన అనంతరం పోలీసుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు.
బార్ పర్మిషన్ తో పబ్ నిర్వహణ.. పోలీసులు సీరియస్..
బాచుపల్లి పియస్ పరిదిలోని టకీల పబ్ పై బాచుపల్లి పోలీసుల రైడ్ చేశారు. అనుమతి లేకుండా డ్యాన్స్ ఫోర్స్, మ్యూజికల్ నైట్స్, కార్పోరేట్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్టు పోలీసుల వెల్లడించారు. కేవలం బార్ పర్మిషన్ తో టకీల పబ్ నిర్వహణపై అధికారులు సీరియస్ అయ్యారు. టకీల పబ్ లోని మ్యూజికల్ ఎక్విఫ్మెంట్ తో పాటు 2ల్యాప్ టాప్ ల సీజ చేశారు. టకీల పబ్ పై కేసు నమోదు చేశారు. బార్ పర్మిషన్ తీసుకుని డ్యాన్స్ ఫోర్స్, మ్యూజికల్ నైట్స్, కార్పోరేట్ ఈవెంట్స్ ఎలా చేస్తున్నారని మండిపడ్డారు. బార్ పర్మిషన్ తీసుకున్న యజమాని ఎవరని ప్రశ్నించారు? బార్ అని బోర్డు పెట్టి లోపల పబ్ నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఎవరైనా సరే చేపడితే సహించేది లేదని తెలిపారు. ఎంతటి వారైనా కఠిచర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటి కైనా సిటీలోని పబ్ యాజమాన్యం తీరు మార్చుకోవాలని సూచించారు.
పట్టు బిగించిన ఎన్ఐఏ.. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై భారీ రివార్డు ప్రకటన
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పట్టు బిగించింది. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్‌ఐఏ ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్ అలియాస్ భాను పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు. గాయకుడు, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా అతను ప్రధాన నిందితుడు. 2023లో దర్యాప్తు సంస్థ అతనిపై చార్జిషీటు దాఖలు చేసింది. సమాచారం ప్రకారం, అతను నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుండి పారిపోయాడు. అన్మోల్ బిష్ణోయ్ ఎప్పటికప్పుడు తన లొకేషన్‌లను మారుస్తూ ఉంటాడు. గత సంవత్సరం కెన్యా, ఈ సంవత్సరం కెనడాలో కనిపించాడు. ఇకపోతే, రికార్డ్స్ లో అన్మోల్ బిష్ణోయ్‌పై 18 క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. జోధ్‌పూర్ జైలులో శిక్షను అనుభవించాడు కూడా. అన్మోల్ 2021 అక్టోబర్ 7న బెయిల్‌పై విడుదలయ్యాడు.
డీప్‌ఫేక్‌లు, ఏఐలను నియంత్రించేందుకు ఏం చేస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీని నియంత్రించేందుకు ఏం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి మూడు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 21న జరగనుంది. డీప్‌ఫేక్‌ల ద్వారా వీడియోలు సృష్టించి అప్‌లోడ్ చేస్తున్నారని, వాటి ద్వారా వ్యక్తుల గురించి తప్పుడు సమాచారాన్ని అప్‌లోడ్ చేస్తున్నారని కోర్టు పేర్కొంది. డీప్‌ఫేక్‌ల వినియోగం పెరిగిపోయిందని, అందుకే వాటిని ఎదుర్కోవడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. దీనిపై కేంద్రం సీరియస్‌గా ఆలోచించాలి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏదైనా కమిటీని ఏర్పాటు చేశారా అని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇంకా కమిటీ వేయకపోతే కోర్టు కమిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపింది. అనంతరం కేంద్రం తరఫున హాజరైన ఏఎస్‌జీ చేతన్ శర్మ.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ దీనిని పరిశీలిస్తోందని చెప్పారు. ఈ విషయం సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మొత్తం సమాచారాన్ని బహిరంగపరచలేమని చేతన్ శర్మ అన్నారు. అప్పుడు కోర్టు కమిటీ గురించి అంతా చెప్పొద్దని, అయితే దీనిపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా అనేది తెలుసుకోవాలని అన్నారు. దీనిపై మూడు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.
గాజాలో ఇజ్రాయెల్ దాడులు.. 17 మంది పాలస్తీనియన్ల మృతి..
హమాస్ అధినేత యాహ్య సిన్వర్ మరణించిన గాజాపై ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తుంది. గురువారం సెంట్రల్ గాజాలోని నుసీరత్ శిబిరంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 42 మంది తీవ్రంగా గాయాలు అయ్యాయి. మృతుల్లో 13 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఐడీఎఫ్ మాత్రం తాము హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా దాడిలు చేశామని వెల్లడించింది. కాల్పుల విరమణ చర్చలు త్వరలోనే స్టార్ట్ అవుతాయని పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఖతార్‌లో ఉన్న అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పుకొచ్చారు. హమాస్ చర్చలకు సిద్ధంగా ఉందా లేదా అనే విషయాన్ని మేం ఇంకా ధ్రువీకరించుకోవాల్సి ఉందన్నారు. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనియన్లకు 135 మిలియన్ డాలర్ల సాయాన్ని ఈ సందర్భంగా బ్లింకెన్ ప్రకటించారు.
మీ ఆరెంజ్‌లను చెక్ చేసుకోండి.. యువరాజ్ సింగ్ యాడ్‌పై విమర్శలు!
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యువీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘యూవీకెన్’ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. ఈ ఎన్జీవో దేశంలోని మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు యాడ్‌లు చేస్తుంటుంది. తాజాగా యూవీకెన్ చేసిన యాడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘యువరాజా.. ఇదేం అవేర్‌నెస్ క్యాంపెయిన్’ అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు మహిళలు తరచూ తమని తాము పరిశీలించుకోవాలంటూ యూవీకెన్ తాజాగా ఓ యాడ్ విడుదల చేసింది. ఏఐ ద్వారా రూపొందించిన పోస్టర్‌ను ఓ మెట్రో కోచ్‌లో అతికించింది. ఆ పోస్టర్‌లో ఒక యువతి రెండు నారింజ పండ్లను పట్టుకుని బస్సులో నిలబడి ఉండగా.. పలువురు మహిళలు ఆమెను చుస్తున్నారు. ‘మహిళలు నెలకోసారి తమ నారింజలను చెక్ చేసుకోలి’ అని కాస్త అసభ్యకరంగా రాసుకొచ్చింది. యూవీకెన్ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. నారింజలు అనే పదం వాడడం కొందరికి నచ్చలేదు. దాంతో ఈ యాడ్‌పై విమర్శలు వస్తున్నాయి. యువరాజ్ సింగ్‌పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు.
సర్ ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ స్వాగ్.. ఎక్కడ చూడాలంటే
హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా యంగ్ హీరో శ్రీ విష్ణు వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఆయన నటించిన మరో మూవీ స్వాగ్. విలక్షణ నటనతో ఆకట్టుకునే ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది ఇప్పటికే ఓం భీమ్ బుష్ అనే ఓ హారర్ కామెడీ సినిమాతో శ్రీవిష్ణు హిట్ కొట్టాడు. మరోసారి ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. స్వాగ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ విష్ణు ఈ సినిమాలో సింగ, భవభూతి, యయాతి, కింగ్ భవభూతి అనే నాలుగు పాత్రల్లో కనిపించారు. నాలుగు క్యారెక్టర్లలో నాలుగు డిఫరెంట్ షేడ్స్, భిన్నమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. రెండు కాలాల మధ్య సాగే కథగా ఈ సినిమా ఉంది. అయితే గతేడాది సామజవరగమన, ఈ ఏడాది ఓం భీమ్ బుష్ లతో వరుస హిట్స్ కొట్టిన శ్రీ విష్ణు.. ఈ స్వాగ్ హ్యాట్రిక్ కొట్టాడు. ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించాడు. రీతూ వర్మతోపాటు సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ కూడా చాలా రోజుల తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించనుంది. సునీల్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.
తారకరత్న కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్.. కుందనపు బొమ్మలా ఎంత బాగుందో !
నందమూరి తారకరత్న ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన పేరు వినగానే కన్నీళ్లు ఉబికి వచ్చేస్తాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ, 39ఏళ్లకే హర్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. తన నటనతో హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నందమూరి ఫ్యామిలి నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. తారకరత్న 2001లో ఏకంగా 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. 2002లో విడుదలైన ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఎంట్రీ .. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.