Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెబుతూ.. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటు పురంధేశ్వరి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి, చేసి చూపిస్తున్నాం అన్నారు.. 2,245 కోట్ల రూపాయలతో ఎర్రుబాలెం నుండి నంబూరు వరకు రైల్వే లైన్ రావడం సంతోషం అన్నారు.. 55 కిలో మీటర్ల ఈ రైల్వే లైన్ ఉంటుంది.. ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని అని చెప్పి, ఆ మాటకే కట్టుబడి వున్నాం అని మరోసారి స్పష్టం చేశారు.. కనకదుర్గ ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌లకు కేంద్రం సహకారం అందించింది.. పోలవరానికి కూడా కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.
Read Also: US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేలో మరో ట్విస్ట్..
ఇక, వికసిత్ భారత్ తో పాటు వికసిత్ ఏపీ కూడా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ ఎల్లప్పుడూ చెబుతారని.. సాధ్యమైనంత త్వరగా అమరావతి రైల్వే లైన్ పూర్తి చేస్తాం అన్నారు పురంధేశ్వరి.. కాగా, అమరావతికి 57 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు.. గురువారం రోజు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన విషయం విదితమే.. రూ.2,245 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు గ్నీన్ సిగ్నల్ వచ్చిందని.. హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించిన విషయం తెలిసిందే.