Bride Left the Wedding Hall: కొన్ని సినిమాల్లో చూస్తుంటాం.. తాళికట్టే సమయంలో వచ్చి హీరో.. పెళ్లి ఆపేస్తుంటాడు.. మరికొన్ని సినిమాల్లో ముహూర్తం సమయానికి వచ్చి.. పెళ్లి కూతురును లేవదీసుకుపోతారు.. ఇంకా కొన్ని మూవీస్‌లో పెళ్లికూతురే.. మండపం నుంచి వెళ్లిపోతుంది.. అయితే, రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఎలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా, కర్నూలు జిల్లా పత్తికొండలో అన్ని ఏర్పాట్లు చేశారు.. సగం కార్యక్రమాలు పూర్తి చేశారు.. కానీ, పెళ్లి సమయానికి పెళ్లి కూతురు వెళ్లిపోవడంతో.. ఆ మ్యారేజ్ పీఠలపైనే నిలిచిపోయినట్టు అయ్యింది..
Read Also: Flood Relief Compensation: విజయవాడ వరద బాధితులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలో నగదు జమ
ఈ ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురానికి చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడు విశ్వాసికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లి ,రాత్రి సంప్రదాయాల ప్రకారం చిన్నతంబులం,పెద్ద తాంబూలం కూడా చేశారు. అయితే అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో.. పత్తికొండలోని గోపాల్ ప్లాజా కళ్యాణ మండపం నుండి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయింది. దీంతో.. మరికొన్ని గంటలలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి నిలిచిపోవడంతో పెళ్లి కుమార్తె తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. పత్తికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, తెల్లవారుజామున 4 గంటలకు కళ్యాణ మండపం నుండి ఒక అబ్బాయితో బైక్ పై వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. జరగాల్సిన పెళ్లి ఒక్కసారిగా నిలిచిపోవడంతో అటు పెళ్లికూతురు, ఇటు పెళ్లి కుమారుడు బంధువులు నిరుత్సాహంగా ఉండిపోయారు. ఏమైనా ఉంటే పెళ్లికి ముందే చూసుకోవాలని.. అన్ని అయిపోయిన తర్వాత అమ్మాయి ఇలా చేయడం మంచిపద్ధతి కాదంటూ అబ్బాయి బంధువులు వాపోయారు..