దసరా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మావోలతో సహా నాలుగు కుంకీ ఏనుగులను పంపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆరు కీలకమైన ఒప్పందాలు జరిగాయి..
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ పాలసీపై నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది.. ఏపీని ఐటీ హబ్ చేసేలా పాలసీ రూపకల్పన పై ప్రధానంగా చర్చించారు సీఎం.. ఏపీలో ఏఐ కంపెనీల స్థాపనకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది..
చిత్తూరు, మన్యం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పంటపొలాల పై ఏనుగుల దాడి అంశాలు మా దృష్టికి మీడియా తీసుకొచ్చింది అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పంటపొలాల పై ఏనుగుల దాడి అంశంలో కర్ణాటక నుంచి సహాయం అందుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు.. రెండు రాష్ట్రాల మధ్య దేశంలోనే ఇలాంటి ఎంఓయూ గతంలో జరగలేదు పవన్ కల్యాణ్.. ఏపీ, కర్ణాటక మధ్య ఆరు అంశాలపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు..
వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆసక్తి రేపుతోన్న వేళ.. టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు వైఎస్ జగన్ ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదంటున్నారు భూమన.. ఐదుసార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిని ఎలా అడిగుతారు డిక్లరేషన్? అని నిలదీశారు.. టీటీడీ డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వం పతనం ప్రారంభం అయినట్లే అవుతుందన్నారు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా ఇప్పటికే వందల కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. పెద్దలను వదిలేసి పేద, మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోరాదని నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏ నేతలు .. తిరుమలకు జగన్ వెళ్లే దారిలో ఎన్డీఏ కూటమి నేతలు శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించారు.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీకి జగన్ కారణమని ఎన్డీఎ కూటమి నిరసనకు ప్లాన్ చేసింది.. రాజకీయ బలప్రదర్శనకు వైసీపీ దిగితే దీటుగా సమాధానం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.
కడపలో సినిమా చేస్తూ ఎన్టీఆర్ అభిమాని ప్రాణాలు విడిచాడు.. దేవర చిత్రం విడుదల సందర్భంగా కడపలోని అప్సర థియేటర్లో అభిమానుల కోసం ఫ్యాన్స్ షో వేశారు.. ఇక, సినిమా చూస్తున్న క్రమంలో అభిమానులు రెచ్చిపోయారు.. ఎన్టీఆర్ ఎంట్రీ.. ఫైట్స్, డైలాగ్స్.. ఇలా ప్రతీ సీన్‌కి అరుపులు, కేకలతో హోరెత్తించారు.. అయితే, కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఓ అభిమాని.. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. కానీ, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.
వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై హాట్ కామెంట్లు చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.. గత కొంత కాలంగా జరుగుతున్న తిరుమల వివాదం తెలిసిందే.. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు.. కల్తీ నెయ్యి పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ విచారణకు ఆదేశించడం శుభపరిణామంగా పేర్కొన్నారు.