ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దసరా పండుగ రోజు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ రోజు సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ రివ్యూకు మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు..
ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ స్కామ్ కలకలం రేపుతోంది.. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన మూడు శాఖల్లో సుమారు రూ.28 కోట్ల ఆర్థిక అవకతవకల జరిగినట్టుగా తెలుసత్ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని నేర పరిశోధన విభాగం (సీఐడీ) దీనిపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది.. చిలకలూరిపేట బ్రాంచ్‌లో ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరించారు.. అక్రమాలకు పాల్పడిన ఖాతాదారుల వాంగ్మూలాలను రికార్డు చేశారు.. ఈ సమయంలో కీలక సూత్రధారిగా భావిస్తోన్న బ్యాంక్ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. జానీ మాస్టర్ కేసులో బాధితురాలిగా ఉన్న యువతిపై ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడో యువకుడు.. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన శ్రష్టి వర్మపై నెల్లూరు పోలీసులకు జానీ మాస్టర్ అల్లుడు షమీర్ ఫిర్యాదు చేయడం.. ఆమెపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది..
కర్నూలు జిల్లా దేవరగట్టులో పోలీసులు భారీగా మోహరించారు. మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్నీ ఉత్సవానికి 800 మంది పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. హళగొంద మండలం దేవరగట్టు కొండ ప్రాంతంలో స్వయంబుగా వెలిసిన మాళ మల్లేశ్వర స్వామి దేవాలయంలో విజయదశమి రోజు ఆర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అప్రమత్తంగా ఉన్నారు.
ప్రజలు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నపాలు అందజేశారు. 41వ రోజు “ప్రజదర్బార్” లో ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుఉ పలు సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు మంత్రి నారా లోకేష్.. గత ప్రభుత్వ హయాంలో తరిమేసిన అన్ని పరిశ్రమలను మళ్లీ తీసుకొస్తాం అన్నారు.. టీసీఎస్‌ను తామే ఏపీకి తీసుకొచ్చామన్న వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్.. రాయలసీమ తయారీ రంగానికి, ఉత్తరాంధ్ర సేవా రంగానికి కేంద్రాలుగా మారనున్నాయి అన్నారు..