ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. లాటరీ ద్వారా కేటాయిస్తుండటంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే 17 వందల 97 కోట్ల 64 లక్షల ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 113 షాపులకు 5 వేల 825 అప్లికేషన్స్ వచ్చాయి
ప్రీవెడ్డింగ్ షూట్ విషయంలో హాట్ కామెంట్లు చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మాధురితో కలిసిఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తిరుమల ఇష్యూతో రాజకీయంగా ఇరికించాలని భావించారు. తిరుమల కొండపై ఎలాంటి తప్పు , అపచారం చేయలేదని స్పష్టం చేశారు.. నాలుగు రోజులు తరువాత మాపై కేసులు పెట్టారు. వ్యక్తిగత అంశాలను పార్టీ పట్టించుకోదు. పార్టీకి నేనే చెప్పాను.. వైసీపీ నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదన్నారు.. పార్టీకి వ్యక్తి గత అంశాలను ముడిపెట్టవదన్నారు దువ్వాడ..
మాది అపవిత్రబంధం కాదు.. పవిత్రబంధం.. విడాకులు తీసుకున్నాక ఇద్దరం కలసి ఉంటాం అంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. కొండమీద రీల్స్ చేయలేదు. ఒక్కఫొటో అయినా ఉందా..? నేను ఫొటోగ్రాపర్స్ ని తీసుకువెళ్లలేదన్నారు మాధురి.. వద్దని చెబుతున్నా.. కొందరు నా వెంటపడి వీడియోలు, ఫొటోలు తీశారన్నారు.. అయితే, మాది అపవిత్ర బంధం కాదు.. పవిత్రబంధంగా చెప్పుకొచ్చారు..
బెజవాడలో కలకలం రేపిన రైల్వే లోకో పైలట్ హత్య కేసును ఛేదించారు పోలీసులు.. రెండు రోజుల క్రితం రైల్వే స్టేషన్ సమీపంలోనే లోకో పైలట్ ఏబేలు దారుణ హత్యకు గురవటం తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే.. విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే ఈ హత్య జరగడం సంచలనంగా మారింది.. అయితే, హత్యకు పాల్పడిన వ్యక్తిని సీసీ టీవీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించటంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు.
వ్యాపారులను వేధించే నైజం మాది కాదు.. వ్యాపారులను ఎవరైనా వేధిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించడమే మా ప్రభుత్వ ధ్యేయం అన్నారు. వ్యాపారులను ఎవరు వేధించినా సహించేది లేదన్నారు..
దసరా పండుగ పూట శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో అత్తా కోడళ్లపై అత్యాచారానికి తెగబడ్డారు గుర్తుతెలియని వ్యక్తులు.. నిర్మాణంలో ఉన్న ఓ పేపర్ మిల్లులో వాచ్‌మన్‌గా ఉంటుంది ఓ కుటుంబం.. అయితే, రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు.. కొడవలితో బెదిరించి ఘాతుకానికి పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దసరా పండుగ రోజు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ రోజు సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ రివ్యూకు మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు..
ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ స్కామ్ కలకలం రేపుతోంది.. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన మూడు శాఖల్లో సుమారు రూ.28 కోట్ల ఆర్థిక అవకతవకల జరిగినట్టుగా తెలుసత్ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని నేర పరిశోధన విభాగం (సీఐడీ) దీనిపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది.. చిలకలూరిపేట బ్రాంచ్‌లో ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరించారు.. అక్రమాలకు పాల్పడిన ఖాతాదారుల వాంగ్మూలాలను రికార్డు చేశారు.. ఈ సమయంలో కీలక సూత్రధారిగా భావిస్తోన్న బ్యాంక్ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.