ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేలా ప్రభుత్వాలుచర్యలు తీసుకుంటున్నాయి.. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను మినహాయింపు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పన్ను మినహాయింపు గడువును మరో ఆరు నెలలు పాటు పొడిగించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. 2024 డిసెంబర్ 7 తేదీ వరకూ రాష్ట్రంలో ఈవీలపై పన్ను మినహాయిస్తూ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
మంత్రి కొలుసు పార్థసారథి కొత్త ఛాంబర్లోకి మారారు.. సచివాలయంలోని బ్లాక్ 4లో ఫస్ట్ ఫ్లోర్‌లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు మంత్రి పార్థసారథి.. ఇప్పటి వరకు తన ఛాంబర్ పనులు పూర్తి కాకపోవడంతో తాత్కాలిక ఛాంబర్‌లోనే విధులు నిర్వహిస్తూ వచ్చారు మంత్రి కొలుసు.. ఇక, పనులు పూర్తి కావడంతో.. ఇప్పుడు కొత్త ఛాంబర్లోకి మారారు.. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు.. ఉద్యోగులు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఉమ్మడి కడప జిల్లాలోని మైసూర వారి పల్లెకు మహర్దశ పట్టింది.. డిప్యూటీ సీఎం సొంత నిధులతో పాఠశాలకు ప్లే గ్రౌండ్ దానం చేశారు.. తన సొంత ఖర్చులతో 60 లక్షలు ఖర్చు చేసి 97 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి పంచాయితీ కార్యాలయానికి దానం చేశారు పవన్ కల్యాణ్..
తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడడం లేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనద్రోణి ప్రబావంతో.. ఇరురాష్ట్రాల్లోనూ పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా పలుజిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్‌ను అయితే వరుణుడు వీడడంలేదు. ఎప్పుడూ ఏదో ఓ ప్రాంతాన్ని భారీ వర్షం కుమ్మేస్తోంది. ఇప్పుడు ద్రోణి ప్రబావంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు..
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు 9వ రోజు కనకదుర్గమ్మ మహిషాసురమర్ధిని గా దర్శనం ఇస్తున్నారు.. మహిషాసురుని సంహారం చేసిన కనకదుర్గమ్మను మహిషాసురమర్ధిని గా పిలుస్తారు.. ఇక, మహిషాసురమర్ధిని అలంకారంలో దర్శనం ఇస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు..
వైద్య సిబ్బంది పనివేళలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది నిర్ణీత పనివేళలు పాటించకపోవడంపై మండిపడ్డారు.. ఈ విషయంపై గురువారం సాయంత్రం మూడు గంటలకు పైగా మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులతో లోతుగా సమీక్షించారు. పనివేళల పట్ల నెలకొన్న క్రమశిక్షణా రాహిత్యం, దానిని అరికట్టేందుకు ప్రస్తుతం వివిధ స్థాయిల్లో చేపడుతున్న చర్యలు, పరిస్థితిని మెరుగుపర్చేందుకు మున్ముందు చేపట్టాల్సిన చర్యల గురించి వివరంగా చర్చించారు.
కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీ ట్రాప్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.. తవ్వే కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి.. హనీ ట్రాప్ కేసు గుట్టు రట్టు అవ్వడంతో ఒక్కొక్కరిగా బాధితులు పోలీస్ స్టేషన్‌కు క్యూలు కడుతున్నారు.. తాజాగా మరో కొత్త విషయం బయటకు వచ్చింది.. పోలీసులకే జలక్ ఇచ్చింది మాయ లేడీ జాయ్ జేమియా..
దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన.. ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైన వెంటనే రతన్ టాటాకు నివాళులర్పించింది.. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ ను సృష్టించారని ముఖ్యమంత్రి కొనియాడారు.