ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంటలో మరో విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త.. కన్న ఇద్దరు కుమారులు ఒకేసారి మృతిచెందడంతో.. రెండు రోజులు తీవ్ర మనస్థాపంతో ఉన్న భార్య దేవి.. చివరకు తాను కూడా ప్రాణాలు విడిచింది..
ఇవాళ రాత్రి ఏడు గంటలతో మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.. రాష్ట్రంలోని 3,396 మద్యం షాపులకు వెల్లువలా దరఖాస్తులు వచ్చాయి.. ఇప్పటి వరకు మద్యం షాపుల కోసం 65,424 దరఖాస్తు చేసుకున్నారు.. మద్యం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1308 కోట్ల మేర ఆదాయం వచ్చింది..
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.. పిఠాపురంలో సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 21 మంది జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బంది పడుతోన్న ప్రజలకు తక్కువ ధరకే వంట నూనెలు అందిస్తోంది.. ఇవాళ్టి నుంచి వంట నూనె ధరలు తగ్గించి అమ్మాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. కిలో పామాయిల్ రూ. 110, సన్ ఫ్లవర్ నూనె రూ.124కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేలా ప్రభుత్వాలుచర్యలు తీసుకుంటున్నాయి.. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను మినహాయింపు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పన్ను మినహాయింపు గడువును మరో ఆరు నెలలు పాటు పొడిగించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. 2024 డిసెంబర్ 7 తేదీ వరకూ రాష్ట్రంలో ఈవీలపై పన్ను మినహాయిస్తూ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
మంత్రి కొలుసు పార్థసారథి కొత్త ఛాంబర్లోకి మారారు.. సచివాలయంలోని బ్లాక్ 4లో ఫస్ట్ ఫ్లోర్‌లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు మంత్రి పార్థసారథి.. ఇప్పటి వరకు తన ఛాంబర్ పనులు పూర్తి కాకపోవడంతో తాత్కాలిక ఛాంబర్‌లోనే విధులు నిర్వహిస్తూ వచ్చారు మంత్రి కొలుసు.. ఇక, పనులు పూర్తి కావడంతో.. ఇప్పుడు కొత్త ఛాంబర్లోకి మారారు.. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు.. ఉద్యోగులు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఉమ్మడి కడప జిల్లాలోని మైసూర వారి పల్లెకు మహర్దశ పట్టింది.. డిప్యూటీ సీఎం సొంత నిధులతో పాఠశాలకు ప్లే గ్రౌండ్ దానం చేశారు.. తన సొంత ఖర్చులతో 60 లక్షలు ఖర్చు చేసి 97 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి పంచాయితీ కార్యాలయానికి దానం చేశారు పవన్ కల్యాణ్..
తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడడం లేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనద్రోణి ప్రబావంతో.. ఇరురాష్ట్రాల్లోనూ పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా పలుజిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్‌ను అయితే వరుణుడు వీడడంలేదు. ఎప్పుడూ ఏదో ఓ ప్రాంతాన్ని భారీ వర్షం కుమ్మేస్తోంది. ఇప్పుడు ద్రోణి ప్రబావంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు..