Jyothula Nehru: అభివృద్ధి, సంక్షేమాల వారధి రాష్ట్ర బడ్జెట్
- అభివృద్ధి.. సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్..
- కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ తో అందరికీ న్యాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyothula Nehru: అభివృద్ధి, సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని టీటీడీ బోర్డు మెంబర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై జగ్గంపేటలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు, అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజల ఆమోదయోగ్యంగా ఉందని.. పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని, వైసీపీ ప్రభుత్వ చేతగాని పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలతో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిలో పెడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యతాయుతంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో గాలి నాణ్యత ఎలా ఉందో తెలుసుకునే కొత్త ఫీచర్..
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని వారికోసం బడ్జెట్ లో విద్యా, వైద్యానికి పెద్దపీట వేశామని తెలిపారు జ్యోతుల నెహ్రూ.. 2.94 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో బీసీలకు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు.. గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి సారించిన ప్రభుత్వం పంచాయితీ రాజ్ శాఖకు 16 వేల 739 కోట్ల రూపాయలు కేటాయించిందని.. అలాగే రోడ్ల్ అభివృద్ధికి 9554 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. విద్యా వ్యవస్థలో నూతన మార్పులు తీసుకొచ్చే విధంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసిన కూటమి ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం 4280 కోట్ల, ఎస్సీ ల సంక్షేమం కోసం 18497 కోట్ల రూపాయలు, ఎస్టీ అభివృద్ధి కోసం 7557 కోట్ల రూపాయలు, ఎస్టీల అభివృద్ధి కోసం 7557 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించినట్లు జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ పై ప్రశ్నించే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేకే అసెంబ్లీకి రావటం లేదని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ…
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!