AP Whips and Chief Whips: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఖాళీగా పదవులను భర్తీ చేస్తూ వస్తోంది. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల్లో పలువురు నేతలను నియమించిన కూటమి సర్కార్.. తాజాగా శాసనసభ, శాసనమండలి చీఫ్ విప్, విప్‌లను నియమించింది. శాసనసభలో ముగ్గురు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం దక్కింది. శాసనసభ చీఫ్ విప్‌గా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలి చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వ విప్ గా నియమించబడ్డారు. గతంలో కాలవ శ్రీనివాసులు 2014- 19 కాలంలో చీఫ్ విప్ గా పనిచేశారు. 2019 -24 కాలంలో రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి కూడా విప్ గా ఉన్నారు. కాలవ శ్రీనివాసులు ప్రభుత్వ విప్ గా నియమించబడటం పట్ల స్థానిక పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Read Also: POCO X7 : మిడ్ రేంజ్లో హైపర్‌ఓఎస్ 2.0 ఓఎస్‌తో మొదటి మొబైల్ ఇదే
అసెంబ్లీ, కౌన్సిల్‌లో ఎన్డీఏ కూటమి నిర్ణయించిన చీఫ్ విప్, విప్‌లను పరిశీలిస్తే..
కౌన్సిల్ లో ఛీఫ్ విప్ (టీడీపీ) – పంచుమర్తి అనురాధ.. టీడీపీ విప్ – వేపాడ చిరంజీవిరావు.. టీడీపీ విప్ – కంచర్ల శ్రీకాంత్, జనసేన విప్ – పెడిగు హరిప్రసాద్..
అసెంబ్లీలో.. చీఫ్ విప్ (టీడీపీ)- జీవీ శివ సీతారామాంజనేయులు, బెందాళం అశోక్ – విప్ (టిడిపి), బొండా ఉమామహేశ్వరరావు – విప్ (టిడిపి), దాట్ల సుబ్బరాజు – విప్ (టిడిపి), యనమల దివ్య – విప్ (టిడిపి), డాక్టర్ వి.ఎం.థామస్ – విప్ (టిడిపి), తోయక జగదీశ్వరి – విప్ (టిడిపి), కాల్వ శ్రీనివాసులు – విప్ (టిడిపి), రెడ్డప్పగారి మాధవి – విప్ (టిడిపి), పి.జి.వి.ఆర్.నాయుడు (గణబాబు) – విప్ (టిడిపి) తంగిరాల సౌమ్య – విప్ (టిడిపి), యార్లగడ్డ వెంకట్రావు – విప్ (టిడిపి), ఆదినారాయణ రెడ్డి – విప్ (బిజెపి), అరవ శ్రీధర్ – విప్ (జనసేన), బొలిశెట్టి శ్రీనివాస్ – విప్ (జనసేన), బొమ్మిడి నారాయణ నాయకర్ – విప్ (జనసేన)
ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు అప్పగించిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తా అన్నారు.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు నా ధన్యవాదాలు తెలిపారు.. చీఫ్ విప్ గా అసెంబ్లీ సజావుగా సాగేందుకు నా బాధ్యతలు నిర్వర్తిస్తా.. కష్టపడే వారికి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు..