గుంటూరు ప్రభుత్వ హాస్పటల్లో సహన కుటుంబ సభ్యులను పరామర్శించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయితే, జగన్ చూసేందుకు భారీగా వైసీపీ కార్యకర్తలు రావడంతో తోపులాట జరిగింది.. ఇక, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్.. కూటమి ప్రభుత్వంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో నా దళిత చెల్లి మరణం చూస్తే అర్ధం అవుతుందన్నారు.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా సాగింది.. శ్రీశైలం దేవస్థానం వైదిక కమిటీ సూచన మేరకు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బంగారు స్వర్ణరథోత్సవం దేవస్థానం ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు సీనియర్ నేత వాసిరెడ్డి పద్మ.. ఈ సందర్భంగా ఓ లేఖను మీడియాకు విడుదల చేశారు.. ''YCPకి గుడ్ బై''.. వైయస్ఆర్ సీపీకి రాజీనామా చేస్తూ మీడియా ద్వారా తెలియచేస్తున్నాను అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు వాసిరెడ్డి పద్మ.. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పద్మ..
బద్వేల్ లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లితో ఫోన్ లో మాట్లాడి పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు.. విద్యార్థిని కుటుంబ సభ్యలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.. బాధిత కుటుంబ సభ్యులచే సీఎం చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి.. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారని.. అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు..
నేడు ఏపీ హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది.. సినీ హీరో అల్లు అర్జున్ పిటిషన్ సహా.. ముంబై నటి జత్వాని కేసు సహా పలు పిటిషన్లు విచారణకు రానున్నాయి.. ఏపీ హైకోర్టులో హీరో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని పిటిషన్ వేశారు అల్లు అర్జున్.. ఇక, ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది..
భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, ఏపీ రేరా అనుమతులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.. అన్ని రకాల ఫీజులు చెల్లించి, సరైన డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఆన్లైన్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల తక్షణ పరిష్కారానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్ణయం తీసుకున్నారు.
నేడు ఏపీ కేబనెట్ భేటీ.. కీలక అజెండాపై చర్చ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇవాళ జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం విధి విధానాలకు ఆమోద ముద్ర వేయనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ధిదారులు, పథకానికి అర్హుల ఎంపిక, […]
మరో కీలక నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.. వైసీపీకి ఇవాళ రాజీనామా చేయనున్నారు వాసిరెడ్డి పద్మ.. గ న్నికల్లో జగ్గయ్యపేట సీటు ఆశించారు వాసిరెడ్డి పద్మ.. అయితే, ఇటీవల తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట ఇంఛార్జ్ గా నియమించింది వైసీపీ అధిష్టానం.. ఇక, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సీటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో వాసిరెడ్డి పద్మ ఈ నిర్ణయానికి వచ్చారనే చర్చ సాగుతోంది..
బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. రేపు దానా తుఫాన్ తీరం దాటనుంది. ఏపీ సహా మూడు రాష్ట్రాలపై తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతోంది. దానా తుఫాన్ ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్ మధ్య తీరం దాటనుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు గుంటూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు.. ముందుగా గుంటూరు జిల్లా తెనాలిలోని సహన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్నారు.