Tirumala Tickets Alert: తిరుమల శ్రీవారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. కాసేపట్లో శ్రీవారి దర్శనంతో పాటు.. ఇతర సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించిన ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టిక్కెట్లు విడుదల కానుండగా.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల చేస్తారు.. ఇక, మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు కోటా విడుదల కాబోతోంది.. మరోవైపు.. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో పెట్టనుంది టీటీడీ.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు..
Read Also: Nitish Reddy: నా ఆరాధ్య దైవం నుంచి క్యాప్ అందుకోవడం ఆనందంగా ఉంది: నితీశ్ రెడ్డి
ఇక, తిరుమలలో యాత్రికుల వసతి సముదాయం 3లో సెంటర్ లాకర్ సిస్టం ప్రారంభించారు టీటీడీ ఈవో శ్యామలరావు.. వసతి గదులు దోరకని భక్తులకు 1,480 లాకర్లను అందుబాటులోకి తెచ్చింది టీటీడీ.. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. 16 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు.. ఇక, శుక్రవారం శ్రీవారిని 63,731 మంది భక్తులు దర్శించుకున్నారు.. 22,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.94 కోట్లుగా వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)..