YSRCP Boycott PAC Elections: పాకిస్థాన్‌లో కూడా ఇలా లేదు.. పీఏసీ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం..
- పీఏసీ ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ..
- గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు..
- ఆర్టికల్ 309 ప్రకారం ప్రతిపక్ష నాయకుడికే పీఏసీ ఇవ్వాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Boycott PAC Elections: పీఏసీ చైర్మన్ పదవి విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు.. అందుకే తాము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం అని ప్రకటించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పీఏసీ చైర్మన్ ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న వారికి ఇవ్వలేదని గుర్తుచేశారు.. ఆర్టికల్ 309 ప్రకారం ప్రతిపక్ష నాయకుడికే ఇవ్వాలని స్పష్టం చేశారు.. అంతెందుకు 1981, 82లో బీజేపీకి ఇద్దరే ఉన్నా వారికే PAC చైర్మన్ ఇచ్చారన్నారు.. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేక పర్యాయాలు పీఏసీ చైర్మన్ ఇచ్చారని తెలిపారు పెద్దిరెడ్డి.
Read Also: Ram Gopal Varma: ఆర్జీవీ పిటిషన్లపై విచారణ వాయిదా.. అన్ని కలిపి ఒకేసారి..!
Also Read
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
ఇక, పీఏసీ అన్ని తప్పిదాలనూ ఎత్తి చూపుతుంది.. పాకిస్థాన్ సహా అన్ని దేశాల్లో పీఏసీ ప్రతిపక్షానిదే అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. గతంలో అనేక కుంభకోణాలు వెలుగులోకి తెచ్చింది పీఏసీయే అని వెల్లడించారు.. బోఫోర్స్ కుంభకోణం వెలికి తీసింది కూడా పీఏసీనే.. 2G స్పెక్ట్రమ్ కూడా మనోహర్ జోషీ వెలికి తీశారు.. కామన్ వెల్త్ గేమ్స్ లో కుంభకోణాలు కూడా 2010లో PAC వెలికి తీసింది.. 1994లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకున్నా గీతారెడ్డికి PAC ఇచ్చారు.. 2019లో మేం PAC చైర్మన్ గా పయ్యావుల కేశవ్ కి ఇచ్చాం.. అధికారంలో ఉండే వారికి ఇస్తే ఏం న్యాయం జరుగుతుంది..? అని ప్రశ్నించారు.. జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.. అయితే, గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి పక్షానికి పీఏసీ చైర్మన్ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం.. అందుకే PAC కమిటీ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇక, ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!