Tirupati Stampede: టీటీడీ పాలకమండలి అత్యవసర భేటీలో కీలక నిర్ణయాలు..
- టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయాలు..
- మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం..
- తీవ్రంగా గాయపడిన ఇద్దరు భక్తులకు రూ.5 లక్షలు..
- గాయపడిన భక్తులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Stampede: తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందారు.. మరికొంతమంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయగా.. ముగ్గురిపై బదిలీ వేటు వేసింది.. ఇక, తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించి, సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు.. ఆ నిర్ణయాలు టీటీడీ పాలకమండలిలో చర్చించి అమలు చేస్తారని పేర్కొన్న నేపథ్యంలో.. ఈ రోజు టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది..
Also Read
టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం ముగిసిన తర్వాత నిర్ణయాలను వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించామని.. సీఎం ఆదేశాలు మేరకు మృతి చెందిన ఆరుగురు భక్తులకు టీటీడీ తరపున 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని వెల్లడించారు.. ఇక, తీవ్రంగా గాయపడిన ఇద్దరు భక్తులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తాం.. గాయపడిన భక్తులకు 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించాం.. రేపటి నుంచి భాదిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన చెక్కులు అందిస్తామని తెలిపారు.. మృతి చెందిన భక్తుల కుటుంబంలో విద్యార్థుల వుంటే వారికి ఉచితంగా విద్యను అందించడంతో పాటు వారి కుటుంబంలోని వ్యక్తులకు ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు.. జ్యుడిషియల్ ఎంక్వయిరీలో భాద్యులను గుర్తించి వారి పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు టీటీడీ ఛైర్మన్.. మరోవైపు.. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వ్యక్తిగతంగా 10 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు పాలకమండలి సభ్యులు ప్రశాంతి రెడ్డి, సుచిత్ర ఎల్లా.. 3 లక్షలు విరాళంగా ప్రకటించారు పాలకమండలి సభ్యులు ఎంఎస్ రాజు..
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!