CS Vijayanand: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ శాఖలు తమ పనితీరు మెరుగుపరచుకోవడానికి వీలుగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సాంకేతిక సహకారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థ పనిచేసి మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన సీఎస్.. ఈ మేరకు వారి సహకారాన్ని కోరారు.. ఇక, త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి వస్తుందన్నారు. సాంకేతిక యుగంలో, ప్రభుత్వ శాఖలో మెరగైన ఫలితాలు రాబట్టడానికి అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలిపారు.
Read Also: US: జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో ప్రముఖులు గుసగుసలు, నవ్వులు.. వీడియో వైరల్
ఆర్టీజీఎస్ ను ప్రభుత్వంలో సాంకేతికపరంగా ఒక కటింగ్ ఎడ్జ్ గా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమన్నారు సీఎస్.. పౌరులకు ప్రభుత్వ సేవలను, పాలనను మరింత చేరువు చేయాలనే సదాశయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకురావాలని సంకల్పించారని విజయానంద్ తెలిపారు.. అన్ని శాఖలకు ఆర్‌టీజీఎస్ నుంచి ఒక ప్రతినిధి వెళ్లి శాఖాధిపతులతో సమావేశం అవ్వాలని సీఎస్ సూచించారు. ప్రభుత్వంలో ప్రతిశాఖ ఆర్‌టీజీఎస్‌తో సమన్వయం కావాలన్నారు సీఎస్ విజయానంద్.. వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యేలా ఇంగ్లీషు, తెలుగు రెండు భాషల్లో ఉండేలా చూడాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్.