Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పిన్నపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు. ఉదయం 11.30 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో అసియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు, నిర్మాణంలో ఉన్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. 15 వేల కోట్లతో 5,230 మెగావాట్ల సామర్థ్యంతో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశలో ఉంది.
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం.. ఆస్తి వివాదంలో జర్నలిస్ట్ కుటుంబం హత్య
ఈ ప్రాజెక్టులో ఇన్ టేక్ వ్యూ పాయింట్, పవర్ హౌస్ దగ్గరి నుంచి పరిశీలిస్తారు. రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుపై అధికారులు పవన్ కల్యాణ్‌కు వివరిస్తారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి విజయవాడ బయల్దేరి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కాగా, ఈ నెల 9వ తేదీనే డిప్యూటీ సీఎం ఈ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో తన పర్యటన వాయిదా వేసుకున్నారు.. తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించిన విషయం విదితమే.. ఇక, నిన్న తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నేడు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు.