తెలుగుదేశం పార్టీ మరో సీనియర్ నేతను కోల్పోయింది.. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు.. ఆయన వయస్సు 99 ఏళ్లు.. ఈ రోజు ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు రెడ్డి సత్యనారాయణ..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు కీలక కేసులపై విచారణ జరగనుంది.. తనపై నమోదైన రెండు కేసులు క్వాష్ చేయాలని కాకాని వేసిన పిటిషన్ పై విచారణ జరపనున్న హైకోర్టు.. పిన్నెల్లి పిటిషన్లపై.. దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు వెలువరించనుంది..
నేడు కీలక సమీక్ష సమావేశాలు నిర్వహించనున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి చేరుకోనున్న సీఎం.. మొదట డ్రోన్, ఐటీ, సెమికండక్టర్ పాలసీలపై అధికారులతో సమీక్ష చేస్తారు.. ఇక, సాయంత్రం 4 గంటలకు పోలవరం పనులపై రివ్యూ చేయనున్నారు.. ఆ తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్స్ తో సమావేశం అవుతారు సీఎం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. దీపావళి సందర్భంగా దీపం-2 పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలెండర్లు పంపిణీ చేస్తున్న విషయం విదితమే కాగా.. ఈ స్కీమ్ కింద గ్యాస్ బుకింగ్స్‌కి భారీ స్పందన వస్తుందు.. అదే స్థాయిలో డెలివరీ చేస్తోంది కూటమి ప్రభుత్వం..
ఈ రోజు పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు రానుండటంతో అధికారులు, నేతలు ఏర్పాట్లు చేశారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలిస్తారు. ఇ
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..?
కార్తీక మాసం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం.. .. ఈ మాసంలో ప్రతీ శైవక్షేత్రంతో పాటు.. ప్రతీ శివాలయంలోనూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ.. కార్తీక దీపాలను వెలిగిస్తూ.. తమ మొక్కులను తీర్చుకుంటారు భక్తులు.. ఇక, కార్తీక మాసంలో వచ్చే తొలిసోమవారానికి ఎంతో ప్రత్యేకత ఉందనే చెప్పాలి.. శ్రీశైలంలో కార్తీకమాస మొదటి సోమవారం మల్లన్నకు ప్రీతికరమైన రోజు.. దీంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది..